తెలంగాణ లో భారీగా పెరిగిన కేసులు.....24 గంటల్లో వేయికి చేరువలో


హైదరాబాద్ కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తూనే వుంది. గడచిన 24 గంటల్లో  985 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 12,349 కి చేరాయి. కరోనాతో ఇప్పటి వరకు కోలుకుని 4766 మంది డిశ్చార్జ్ కాగా 237 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7436 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. నేడు 7 మరణాలు సంభవించాయి. ఇవాళ నమోదైన కేసుల్లో..... జీహెచ్ఎంసీ పరిధిలో 774, రంగారెడ్డి 86, మేడ్చల్ 53, కామారెడ్డి 1, కరీంనగర్ 13, ములుగు 2, సిద్దిపేట 3, రాజన్న సిరిసిల్ల 6, వరంగల్ అర్బన్ 20, మహబూబ్ నగర్ 1, వికారాబాద్ 1, జనగాం 1, నల్గొండ 3, మెదక్ 9, జగిత్యాల 2, ఆదిలాబాద్ 7, భూపాలపల్లి 3, ఖమ్మం 3, నాగర్ కర్నూల్ 6, యాదాద్రి భువనగిరి 2, నిజామాబాద్ 6, నల్లగొండ 1 కేసు నమోదైంది.