టెంట్‌ వద్ద జరిగిన గొడవే భారత్‌-చైనా జవాన్ల మధ్య ఘర్షణకు కారణమా?


భారత్‌-చైనా జవాన్ల మధ్య ఘర్షణ, పలువురి మృతికి దారితీయడానికి టెంట్‌ వద్ద జరిగిన గొడవే కారణమని సమాచారం. వాస్తవాధీన రేఖకు(ఎల్‌ఏసీ) ఇటువైపున భారత భూభాగంలోనే చైనా సైనికులు టెంట్‌ ఏర్పాటు చేశారు. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ ప్రాంతంలో భారత భూభాగంలో పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 అనే చోట చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) టెంట్‌ వేసిందన్న సమాచారంతో భారత జవాన్లు రంగంలోకి దిగారు. ఈ నెల ప్రారంభంలోనే ఈ టెంట్‌ వేశారు. గత వారం ఇక్కడే భారత్, చైనా డివిజన్‌ కమాండర్‌ స్థాయి అధికారుల సమావేశం జరిగింది. గాల్వన్‌లో బలగాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోవాలని ఇరు దేశాల అధికారులు నిర్ణయించుకున్నారు.


జూన్‌ 6న భారత్‌, చైనా లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ ర్యాంకు అధికారుల మధ్య జరిగిన సమావేశంలో టెంట్‌ తొలగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆ టెంట్‌ను తొలగించే ప్రయత్నంలో ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఆ టెంట్‌ను వెంటనే తొలగించాలని భారత జవాన్లు సూచించగానే, పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 పై భాగం నుంచి చైనా జవాన్లు రాళ్లు విసరడం ప్రారంభించారు. ఇనుప రాడ్లతో దాడికి దిగారు.


ఆరుగంటలపాటూ జరిగిన తోపులాటలోపక్కనే ఉన్న గాల్వన్‌లోయలో కూడా కొందరు సైనికులు పడిపోయారు. ఎముకలు కొరికే చలి, హైపోథెర్మియాతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ ఘటనలో గాయపడిన భారత జవాన్లను మిలటరీ ఆసుపత్రికి తరలించారు. పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 గాల్వన్, ష్యోక్‌ నదుల సంగమ ప్రాంతం సమీపంలోనే ఉంది.


ఈ ఘర్షణలో ఇప్పటివరకు కల్నల్ సహా 20 మంది భారత సైనికులు మరణించగా, తాజాగా మరో నలుగురి జవాన్ల పరిస్థితి విషమంగా మారడంతో భారత్‌- చైనా సరిహద్దులో యుద్ద వాతావరణం నెలకొంది. కాగా లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయలో చైనా ఆర్మీతో జరిగిన ఘర్షణలో 76 మంది భారత సైనికులకు గాయాలయ్యాయని, వీరంతా కోలుకుంటున్నారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వీరు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. గాయాలైన సైనికుల్లో 18 మంది లేహ్‌లోని ఆస్పత్రిలో ఉన్నారని, 15 రోజుల్లో వీరు విధుల్లో చేరే అవకాశం ఉందని తెలిపారు.


మిగతా 56 మంది వివిధ ఆస్పత్రుల్లో ఉన్నారని, వీరు వారంలో విధుల్లో చేరవచ్చని చెప్పారు. మనిషి నిల్చునేంత చిన్న స్థలంలో భారత్ సైనికులు తలపడ్డారు.. ప్రత్యక్ష సాక్షి కథనం కేవలం ఒకే ఒక్క మనిషి నిలబడేటంత సన్నని ఒడ్డుపై చైనా, భారత జవాన్లకు మధ్య ఘర్షణ జరిగిందా? ఎముకలు గడ్డకట్టేంత చిన్న కాలువలో చైనా జవాన్లకు మన భారత జవాన్లు దీటైన సమాధానం చెప్పారా?


అసలు గాల్వాన్‌లో ఏం జరిగిందో అందులో పాల్గొన్న సురేంద్ర సింగ్ అనే జవాన్ ఓ ఛానల్‌తో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే చైనా సైనికులు భారత్‌ను దొంగదెబ్బ తీశారు..''చైనా సైనికులు మనకు ధోకా ఇచ్చారు. ఉన్నట్లుండి హఠాత్తుగా మనపై దాడికి దిగారు. 4 నుంచి 5 గంటల వరకూ నదిలోనే వారితో ఘర్షణ జరిగింది.


మన సైనికులు 200 నుంచి 250 మంది ఉన్నారు. చైనా వాళ్లు 1,000 కంటే ఎక్కువ మందే ఉన్నారు. ఈ ఘర్షణ మొత్తం కూడా ఎముకలు గడ్డ కట్టిపోయే, గొంతు కోసే చల్లని నీటిలోనే సాగింది. నది ఒడ్డున కేవలం ఒక్క మనిషి మాత్రమే నిలబడేంత చోటు మాత్రమే ఉంది.


అంత చిన్న స్థలంలో వారితో పోరాడాం. అందుకే పో్రాటంలో చాలా ఇబ్బందులు పడ్డాం. లేకపోతే భారత సైనికులు ఎందులో తక్కువ? మేం చైనా వాళ్లకు సరైన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగానే ఉన్నాం.


కానీ మాపై కుట్రతో, మోసపూరితంగా దాడికి దిగారు.'' అని గాల్వాన్‌లో జరిగిన పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు సురేంద్ర సింగ్ వెల్లడించారు. సురేంద్ర సింగ్.... గాల్వాన్‌లో భారత్ - చైనాకు మధ్య జరిగిన పోరాటంలో పాల్గొన్నారు. తీవ్రంగా గాయపడ్డారు.


తలలో డజనుకు పైగా కుట్లు వేశారు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన ప్రకటించారు. లడఖ్‌లోని సైనిక ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈయన స్వస్థలం రాజస్థాన్.



తెలంగాణ లో ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైన అంశం ఏంటంటే భారత్ చైనాలమధ్య గొడవ, ఆ గొడవలో ఇరవై మంది భారతీయులు మరణించడం. అందులో తెలంగాణ కు సంబందించిన కల్నల్ సంతోష్ అనే వీర జవాన్ మృతి చెందడం..ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన కొన్ని వార్తల ప్రకారం సంతోష్ మరణం కాల్పుల వల్ల జరిగింది కాదు అని తెలుస్తోంది. అయితే ఆయన ఎలా మరణించారని చాలామంది కి ప్రశ్న ఉత్పన్నమయ్యే ఉంటుంది.. 


కొన్నాళ్లుగా చైనా ఆర్మీ భారతదేశ భూగర్భంలో కి రావడానికి ప్రయత్నిస్తోంది.


భారత్ ఆర్మీ వాళ్ళని అడ్డుకుంటోంది. ఇటీవల చైనా మరోసారి అలానే భారతదేశ సరిహద్దులు దాటి రావడానికి ప్రయత్నించింది. దాంతో భారత్ ఆర్మీ మధ్య చైనా ఆర్మీ మధ్య గొడవ మొదలైంది.ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం నుండి తోపులాట వరకు వెళ్ళింది. అసలే చీకటి. ఉష్ణోగ్రత కూడా మైనస్ డిగ్రీల లో ఉంది. మంచు కారణంగా ఎవరికీ ఏమీ సరిగా కనబడలేదు. దాంతో ఆ గొడవ లో కొంతమంది పక్కనే ఉన్న లోయలో పడిపోయారు.


గొడవ సద్దుమణిగిన తర్వాత చూసుకుంటే భారత ఆర్మీ లో ఇద్దరు సైనికులు కనబడలేదు. ఆర్మీ వాళ్ళు ఆ లోయ ప్రదేశాన్ని అంతా వెతికారు. ఎంతోసేపు వెతకగా కొన ఊపిరితో ఉన్న సంతోష్ వాళ్ళకి కనిపించారు. చికిత్స అందించిన కూడా సంతోష్ బతకలేదు. సంతోష్ తో పాటు తమిళనాడుకు చెందిన పళని, ఉత్తరాఖండ్ కి చెందిన ఓజా ఈ ఘటనలో మృతి చెందారు. వీరితో పాటు ఆ గొడవలో గాయపడిన దాదాపు 20 మంది భారతీయ సైనికులు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చైనా మాట్లాడుతూ భారతదేశ సైనికులు కూడా తమ బార్డర్ని దాటేందుకు ప్రయత్నం చేశారని, అలా చేసినప్పుడు చైనా ఆర్మీ వాళ్ళని అడ్డుకుందని చెప్పారు. ఆ గొడవలో చైనా ఆర్మీ వాళ్లకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. దాదాపు 40 మంది చైనా సైనికులు మృతి చెందారు అని వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలను చైనా ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉంది.



దేశ సార్వభౌమత్వం, సరిహద్దు సమగ్రతకు సంబంధించిన వ్యవహారం కావడంతో చైనా సరిహద్దులో జరిగిన హింసాకాండపై భారత ప్రభుత్వం ఆచితూచి స్పందిస్తున్నది. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి కీలక ప్రాంతమైన గాల్వాన్ లోయలో ఘర్షణకు సంబందించి ఇండియన్ ఆర్మీ తాజాగా మరో అధికారిక ప్రకటన చేసింది. మన జవాన్లను చైనా బందీలుగా పట్టుకుందన్న షాకింగ్ విషయాన్ని వెల్లడిస్తూ.. చర్చల తర్వాత 10 మంది విడుదలయ్యారని పేర్కొంది.


భారత్ ప్రతీకారం.. చైనాపై ఎయిర్ స్ట్రైక్స్.. భారీగా ఫైటర్ జెట్స్,యుద్ధనౌకల మోహరింపు.. 'ది సన్' సంచలనం


గాల్వాన్ లోయపై చైనా షాకింగ్ ప్రకటన.. టార్గెట్ అక్సాయ్ చిన్.. 1962 స్ట్రాటజీ.. భారత్ కింకర్తవ్యం?



అసలేం జరిగిందంటే..


సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోన్న క్రమంలో.. తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో సోమవారం(ఈనెల 15) రాత్రి భారత బలగాలపై చైనా సైనికులు పాశవికంగా దాడికి పాల్పడ్డారు. తొలుత ముగ్గురు మాత్రమే చనిపోయారని, ఆ తర్వాత అమరుల సంఖ్య 20గా ఉందని వెల్లడైంది. తాజాగా వెలుగులోకి వస్తోన్న రిపోర్టుల ప్రకారం మనవైపు 30 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, పదుల సంఖ్యలో భారత జవాన్లను చైనా బందీలుగా పట్టుకుందన్న విషయం కలకలం రేపింది. నాటి ఆపరేషన్ లో గాయపడ్డ సైనికుల సంఖ్యే 76గా ఉందని, చనిపోయినవాళ్లు, చైనాకు బందీలుగా చిక్కినవాళ్లను కలిపితే ఈ సంఖ్య భారీగా ఉండొచ్చనే కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్మీ చేసిన అధికారిక ప్రకటన కన్ప్యూజన్లకు చెక్ పెట్టినట్లయింది.



3రోజులు.. 10 మంది..


గాల్వాన్ లోయలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న హింసాయుత ఘర్షణలో మనవాళ్లు 20 మందిచి చంపేసి, మరికొంత మందిని అతి దారుణంగా లోయలోకి నెట్టేసింది. దాంతోపాటు చేతికి చిక్కిన ఇంకొందరిని బందీలుగా తీసుకుంది. వాళ్లలో ఇద్దరు మేజర్ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. అందరి విడుదల కోసం 3వ ఇన్‌ఫంట్రీ డివిజన్ కమాండర్ మేజర్ జనరల్ అభిజిత్ బాపత్ నేతృత్వంలోని బృందం పలు దఫాలుగా చైనా సైన్యంతో చర్చలు జరిపింది. మూడు రోజుల తర్వాత ఎట్టకేలకు గురువారం రాత్రి 10 మంది భారత బలగాలను చైనా విడుదల చేసింది.



ఇంకా బదీలు ఉన్నారా?


గాల్వాన్ లోయలో చైనా అక్రమంగా వేసిన టెంట్లను ఖాళీ చేయించే క్రమంలో భారత జవాన్లపై దాడి జరగడం, అంత కీలకమైన ఆపరేషన్ లో సైనికులను నిరాయుధులుగా ఎందుకు పంపారు? అవతలివాడు చంపేస్తున్నా వెపన్స్ వాడొద్దని ఆదేశాలు ఇచ్చిందెవరు? అంటూ ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. కాగా, గురువారం విడుదలైన 10 మంది కాకుండా.. చైనా చెరలో మనవాళ్లు ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనికి సమాధానంగా.. ''మన బలగాల్లో ఇంకా ఎవరూ తప్పిపోలేదు''అంటూ ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసింది.


1962 తర్వాత తొలిసారి..


భారత సైనికులను చైనా బందీలుగా తీసుకోవడం 1962 యుద్ధం తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. యుద్ధం తర్వాత ఐదేళ్లకు, అంటే, 1967లో పరస్పరం కాల్పులు జరుపుకున్న ఘటనలో వందల మంది చనిపోయినా.. ఒకరినొకరు బందీలుగా తీసుకున్న దాఖలాలు మాత్రం లేవు. సరిహద్దులో చివరిసారిగా తూటాలు పేలింది 1975లో. నాడు భారత పెంట్రోలింగ్ బృందంపై చైనా మాటువేసి కాల్పులు జరిపింది. మళ్లీ ఇన్నేళ్లకు ఎల్ఏసీ వెంబడి సైనికులు చనిపోవడం, బందీలుగా పట్టుకోవడం లాంటి యుద్ధ సన్నివేశాలు చోటుచేసుకున్నాయి.


చైనా టార్గెట్ సాధించిందా?


బందీలుగా తీసుకున్న భారత జవాన్ల విడుదలతో చైనా తన రక్తపాత చర్యలకు బ్రేక్ వేసినట్లుగా భావించాలని, ఇప్పటికే అది అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్లు కనబడుతోందని రిటైర్డ్ ఆర్మీ అధికారులు అభిప్రాయపడ్డారు. అక్సాయ్ చిన్ ను స్వాధీనం చేసుకుంటామంటూ భారత ప్రభుత్వం పార్లమెంటులో చేసిన ప్రకటన దరిమిలా.. ఆ ప్రాంతానికి వెళ్లే ఏకైక మార్గమైన గాల్వాన్ లోయను చైనా ఆక్రమించేసుకుందని, గాల్వాన్ లోయపై సార్వభౌమాధికార ప్రకటనే అందుకు నిదర్శమని, అలాగే పాంగాంగ్ సరస్సుకు ఉత్తరాన ఉన్న ''ఫింగర్ 4'' ప్రాంతాన్ని కూడా డ్రాగన్ తన ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోందని, ఈ టార్గెట్లు సాధించింది కాబట్టే, ఇక కొత్త స్టేటస్ కో పై చైనా చర్చలు జరిపే అవకాశముందని నిపుణులైన మాజీ డిఫెన్స్ అధికారులు వెల్లడించారు.