మాలీవుడ్ నటుడు కళాభవన్ జయేశ్ కన్నుమూత


అన్ని ఇండస్ట్రీ లలో సినీ ప్రముఖుల మరణాలు అభిమానులను , సినీ లోకాన్ని శోకసంద్రంలో పడేస్తున్నాయి. బాలీవుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ ల నటులే కాదు మాలీవుడ్ నటులు కూడా మరణిస్తున్నారు. బాలీవుడ్ లో ప్రముఖ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం జీర్ణించుకోక ముందే బాలీవుడ్ అందగాడు రిషి కపూర్ కూడా తుది శ్వాస విడిచారు. ఇక మాలీవుడ్ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ జయేశ్(44) కన్నుమూశారు.


ఏడాదిగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన ఆదివారం కేరళలోని కోడాకర శాంతి ఆసుపత్రిలో చేరారు. అతడి ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో సోమవారం తుది శ్వాస విడిచాడు. జయేష్ మరణంతో మాలీవుడ్ శోకసంద్రంలోకి వెళ్ళిపోయింది.