రక్తదానం నిర్వహించడం అభినందనీయం


దుండిగల్:‌ కరోనా లాక్‌డౌన్‌ కారణంగా అనేక మంది తలసేమియా వ్యాధితో రక్తం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి మంత్రి కేటీఆర్‌ దృష్టికి ఆయన రక్త దాన శిబిరాలు నిర్వహించాలని సూచించడంతో ఆనేక మంది రక్త దానానికి ముందుకు రావడం అభినం దనీయమని ఎమ్మెల్యే కేపీ వివకానంద్‌, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంబిపూర్‌ రాజు అన్నారు.ఆదివారం కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ కొలను నీలాగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిజాంపేటలోని కొలను రాఘవరెడ్డి గార్డెన్‌లో లైఫ్‌లైన్‌ ఫౌండేషన్‌, లయన్స్‌ బ్లడ్‌బ్యాంక్‌ నిర్వహణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే , ఎమ్మెల్సీలు, నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ ధనరాజ్‌ యాదవ్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ గోపి హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా 186 రక్తదానం చేశారు.


ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఇంద్రజిత్‌ రెడ్డి, బి.చందు ముదిరాజ్‌, ఆగంరాజు, ఏను గుల శ్రీనివాస్‌రెడ్డి, కొలనుఅభిషేక్‌రెడ్డి, పాల్గొన్నారు.