మంత్రి సబితా ఇంద్రారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి ఆమెకు ఛాతిలో నొప్పి రావడంతో అత్యవసరంగా బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ఆమె కోలుకున్నారు. యాంజియోతో పాటు పలు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు మంత్రికి ఆరోగ్య సమస్యలు లేవని తేల్చారు. శుక్రవారం మధ్యాహ్నం డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు. మూడు, నాలుగు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆమెకు వైద్యులు సూచించారు.
సబితారెడ్డికి కేర్‌లో అత్యవసర చికిత్స