యూరప్ లో అందమైన దేశాలలో స్లోవేనియా కూడా ఒకటి. ఇటలీకి దగ్గరగా ఉండటంతో ఈ దేశంలోకి కరోనా వైరస్ ప్రవేశించింది. మార్చి 4 వ తేదీన మొదటి కరోనా కేసు నమోదైంది. ఆ తరువాత కేసులు నమోదవుతున్నా, మార్చి 27 వ తేదీన సుమారు 70 కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు అత్యధిక కేసులు నమోదైన రోజు మార్చి 27. ఆ తరువాత నుంచి కరోనా కేసులు తగ్గడం మొదలుపెట్టాయి.
కరోనా కేసులు తగ్గిపోవడం మొదలుపెట్టాయి. గత వారం రోజుల నుంచి రోజుకు కేవలం ఒకే ఒక్క కేసు నమోదవడం మొదలుపెట్టింది. రోజుకు ఒక్క కేసు మాత్రమే నమోదు కావడం, మరణాల సంఖ్య తగ్గిపోవడంతో ఆ దేశం కరోనా ఫ్రీ దేశంగా మారబోతున్నది. స్లోవేనియాలో ఇప్పటి వరకు మొత్తం 1480 కరోనా కేసులు నమోదుకాగా, ఇందులో 322 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
27 మంది మరణించారు. కేసుల సంఖ్య తగ్గిపోవడంతో మే 31 వ తేదీన స్లోవేనియాను కరోనా ఫ్రీ దేశంగా ప్రకటించబోతున్నారు. కేసులు తగ్గుముఖం పట్టినా లాక్ డౌన్ మాత్రం ఇంకా అమలులోనే ఉన్నది. మే 31 తరువాత లాక్ డౌన్ ను ఎత్తివేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.