అధిక ధరలకు మాంసం విక్రయాలు


బంజారాహిల్స్‌= లాక్‌డౌన్‌ నేపథ్యంలో అధిక ధరలకు మాంసం విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.మాంసం విక్రయదారులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలను పట్టించుకోకుండా ఇష్టారీతిన ధరలు పెంచేసి విక్రయాలు చేస్తున్నారు. బంజారాహిల్స్‌ వెంకటేశ్వర కాలనీ డివిజన్‌ పరిధిలోని మటన్‌ మాంసం విక్రయశాలలో ప్రభుత్వం నిర్దేశించిన ధర కిలో మటన్‌కు రూ. విలువ 700 ఉండగా,దుకాణదారులు రూ.900 నుంచి రూ.1100ల చొప్పున విక్రయిస్తున్నారు.కరోనా వ్యాధి విస్తరిస్తున్న తరుణంలో పౌష్టిక ఆహారం తినాలి అంటూ ఒకపక్క ప్రభుత్వం అధికారులు ప్రకటనలు ఇస్తున్నప్పటికీ మాంసం విక్రయదారులు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు వాపోతున్నారు.బంజారాహిల్స్‌ డివిజన్‌ పరిధిలోని రోడ్‌ నెంబర్‌ 11లో బ్రాండ్‌ మాంసం విక్రయశాలలు సుమారు 900 నుండి 1300 వరకు ఉంటాయి.


వీటిలో మాసాన్ని అధిక ధరలకే విక్రయిస్తున్నారు. దీంతో మధ్యతరగతి ప్రజలు మంసం కొనుగోలు చేయాలంటే తలకుమించిన భారంగా పరిణమిస్తుందనిఆవేదన వ్యక్తం చేస్తున్నారు.