శూద్రులు - 4వ, భాగం - కుమ్మరి (కులం) - శాలివాహన



             


'కుమ్మరి (కులం) ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా బి గ్రూపులో 8వ కులము. ఈ కులాన్ని కుమ్మర , శాలివాహన పేర్లతో కూడా ఈకులాన్ని పిలుస్తారు. మట్టితో కుండలను చేయువానిని కుమ్మరి (Potter) అందురు. కులాలుడు అన్న పదం కూడా సాహిత్యంలో వాడబడుతుంది. వీరి వృత్తిని కుమ్మరం (Pottery) అని అంటారు. ఈ వృత్తి వారసత్వముగా వచ్చునది. దీనిని చేయుటకు తగిన అనుభవము ఉండవలెను. మట్టి గురించి అవగాహన, చేయుపనిలో శ్రద్ధ, కళాదృష్టి లాంటివి ఈ పనికి తప్పని సరి. పూర్వము నుండి కుటుంబ వృత్తిగా ఉన్న కుమ్మరము నేడు కనుమరుగయినది కేవలము కొన్ని గ్రామాలలో తప్ప కుమ్మరులు కానవచ్చుట లేదు.



ప్రదేశం



అతి పెద్ద కులాలలో కుమ్మరి ఒకటి. ఇది భారతదేశం లోని 212 జిల్లాలలో విస్తరించి ఉన్నది. ఈ కులంవారు భారతదేశ రాష్ట్రాలైన పంజాబ్హర్యానారాజస్థాన్ఉత్తరప్రదేశ్బీహార్పశ్చిమ బెంగాల్గుజరాత్మహారాష్ట్రకర్ణాటకలోని కొన్ని ప్రదేశాలు, ఆంధ్రప్రదేశ్ లలో ఉన్నారు. ఈ కులంవారు వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల నామాలతో పిలువబడుతున్నారు.



మూల కధలు, చరిత్ర




  • ప్రతీ రాష్ట్రంలో ఈ కులానికి సంబంధించి ఒక్కో చరిత్ర ఉంది. కుమ్మరులు భారతీయ హిందూ  దేవతలైన త్రిమూర్తులు (బ్రహ్మ,విష్ణు, శివుడు) ఆశీస్సులతో భూమిపై అవతరించామని చెపుతారు. వారికి బ్రహ్మదేవుడు ఈ కళను అందిచాడనీ, విష్ణువు తన చక్రాన్ని అందించాడనీ, లయకారకుడైన శివుడు తన రూపాన్ని అందించాడని అంటారు. వారి మొదటి ఉత్పత్తి నీటి కుండ.

  • ఒకరోజు బ్రహ్మ తన కుమారులకు చెరకు గడను భాగాలుగా చేసి యిచ్చాడు. వారిలో ప్రతీ ఒక్కరూ దానిని తిన్నారు. కానీ కుమ్మరి తన పనిలో నిమగ్నమై ఆ చెరకు ముక్కను తినడం మరచిపోయాడు. ఆ చెరకు ముక్క మట్టి కుప్పపై ఉంచాడు. అది వేర్లు తొడిగి చెరకు మొక్కగా పెరిగింది. కొన్ని రోజుల తరువాత బ్రహ్మ తన కుమారులను చెరకు గురించి అడిగాడు. కానీ ఎవరూ తిరిగి యివ్వలేకపోయారు. కానీ కుమ్మరి చెరకు పూర్తి మొక్కనే యిచ్చాడు. బ్రహ్మ కుమ్మరి యొక్క ఏకాగ్రతను మెచ్చుకొని ప్రజాపతి బిరుదు నిచ్చాడు.

  • విక్రమాదిత్యుడితో’ యుద్దంలో శాలివాహనుడికి సైన్యం లేకపోతే శాలివాహనుడిది  కుమ్మరి  కులవృత్తి కాబట్టటి తమ కులదేవత ’నాగేంద్ర స్వామి" మహిమతో అప్పట్టి కప్పుడు ’మట్టిబొమ్మలు " తయారు చేసి వాటికి ప్రాణం పోసి, ఆ బొమ్మల సైన్యం సహాయం తోనే యుద్దం చేసి, విక్రమాదిత్యుడిని ఓడించి "రాజ్యాధికారం" చేపట్టి మన జాతిని జనరంజకంగా పాలించాడట. ఆయన వంశమే తర్వాత"శాతవాహన వంశం" గా పేరుగాంచి నాలుగు వందల యేండ్లు  తెలుగునాట రాజ్య పాలన చేసారు.



సంప్రదాయములు



మన దేశములో కుమ్మరివారికి రెండు సంప్రదాయములు కలవు.



  • గుండయ్య లేదా గుండ్య సంప్రదాయము

  • శాలివాహన సంప్రదాయము


ఈ రెండింటిలో పౌరాణికమైనది గుండ్య సంప్రదాయం. కొంత చారిత్రికంగా భాసించేది శాలివాహన సంప్రదాయం. శివభక్తుడగు కుమ్మరి గుండయ్య కధ పాల్కురికి సోమనాధుని బసవ పురాణమున కలదు. క్రీ.శ.12వ శతాబ్దమునాటిది. పాల్కురికి సోమనాధుడు జైన తీర్ధంకరుల చరిత్రములు పురాణములు అను పేరున ఉండుట గమనించి, తన గ్రంధమునకు పురాణము అని పేరు పెట్టినాడు. దానికిని మన సంప్రదాయిక పురాణమునకు ఏసంబంధము లేదు. ఇందులో కుమ్మరికి సంబందించిన పదములు వివరించబడినవి. రెండవది అయ్యలరాజు నారాయణామాత్యుని హంసవింశతి. ఇందు కుమ్మరి వృత్తికి సంబందించిన పదజాలము మూడు పద్యములలో కలదు. శాలివాహన సంప్రదాయము ఇది అచ్చముగా చారిత్రకమే. శాలివాహనుడు కుమ్మరి కన్యకకు బ్రాహ్మణుని వలన జన్మించి, కుమ్మరుల కందరకును నాయకుడై, వారి సహాయమున - ఆకాలమున రాజైన విక్రమార్కుని జయించి, ఆరాజ్యమున వశపరచుకొని, రాజ్యమును పాలించి తన పేర శకమున నెలకొల్పెను. ఆ శకమునకే "శాలివాహన శకము" అను పేరు ఇది. క్రీ. శ. 78లో ప్రారంభమైనది. అంతకుముందు విక్రమార్కుని పేర-విక్రమార్క శకము వాడుకలో ఉండేది. ఈ శక కాలమునకే క్రీ.పూ.57 శాలివాహనుడు విక్రమార్కుని జయించి, రాజైన కాలమునుండియు, విక్రమశకము పోయి శాలివాహన శకము వ్యాప్తిలోనికి వచ్చినది.



శాలివాహనులు



1995 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 28, బిసిడబ్ల్యు (ఎమ్‌ఐ) శాఖ, ప్రకారం శాలివాహన కులం కూడా కుమ్మరి కులంగా పరిగణింపబదినది. భారతీయ శాసనాలు, ఇండోనేషియా, ఇండో చైనాలలోని ప్రాచీన సంస్కృత శాసనాలు ప్రకారం ఈ విషయం చెప్పబడింది. శాలివాహన శకాన్ని తెలియజేసే కాలెండరును భారత ప్రభుత్వం 1957 నుండి తొలగించింది. దీనిని కనిష్క మహారాజు స్థాపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు (ఆలం+ఊరు=యుద్దం జరిగిన ఊరు) దగ్గర శాతవాహనుడు విక్రమాదిత్యుని ఓడించి శాలివాహన రాజ్యాన్ని స్థాపించాడని, శాతవాహనుడు కుమ్మరి కులస్తుడని ఒక నానుడి. బౌద్ధ సాహిత్యాన్ని బట్టి దక్షిణ దేశ చరిత్రను క్రీ.పూ 6వ శతాబ్దం నుంచి మనం అంచనా వేయ వచ్చు. శాతవాహనులు రూపొందిన విధానం గురించి కె.కె రంగనాధ చార్యులు ఇలా విశ్లేషిస్తున్నారు. కోసల దేశానికి సంబంధించిన బావరి అనే బ్రాహ్మణుడు దక్షిణాపథానికి వచ్చి గోదావరీ తీరంలో అస్సక జాతివారు నివసించే ప్రాంతంలో స్థిరపడ్డాడు. అతను తన శిష్యులతో బాటు ఊంఛ వృత్తితో జీవించే వాడు. క్రమంగా ఒక గ్రామం వెలసింది. ఒక మహాయజ్ఞం కూడా నిర్వహించాడు. ముసలి తనంలో తన శిష్యులను బుద్ధుడి దగ్గరకు పంపించి సందేహాలను తీర్చుకుని బౌద్ధుడయ్యాడు. బావరి దక్షిణానికి వచ్చిన తర్వాతనే దక్షిణదేశం ఆహారాన్ని సేకరించుకునే దశనుంచి అహోరోత్పత్తి చేసుకునే దశకు వచ్చివుండాలని చారిత్రకుల ఊహ. పైన పేర్కొన్న అస్సక జాతివారే తరువాత శాతవాహన వంశంగా రూపుదిద్దుకున్నారు. బావరి సాంప్రదాయంలో శాతవాహనులు బ్రాహ్మణులను గౌరవించి యజ్ఞాలు చేశారు.        ( తెలుగు సాహిత్యం మరోచూపు, కె.కె.రంగనాద చార్యులు పేజి: 2)--కత్తిపద్మారావు (విశాలాంధ్ర 25.7.2010)


శాతవాహన యుగం


శాలివాహన యుగం "శక యుగం"గా కూడా పిలువబడుతుంది. ఇది హిందూ కాలెండరులలో, భారతీయ జాతీయ కాలెండరు, బాలినేసె కాలెండరు, జవనీస్ కాలెండరు, కంబోడియన్ కాలెండరులలో వాడుతారు. ఈ యుగం యొక్క శూన్యం వెర్నల్ ఈక్వినాక్స్ సంవత్సరం యొక్క 78 నుండి సుమారు ప్రారంభమైనది.[ఆధారం చూపాలి]


పశ్చిమ క్షత్రపాస్ (35–405 BCE) దక్షిణ భారతదేశానికి (సౌరాష్ట్ర, మాల్వా నవీన గుజరాత్, దక్షిణ సింద్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేస్ లోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటక) పాలకులుగా ఉండేవారు. వీరు ఇండో-సైథియన్లు తరువాతి వారు. వారు శక యుగాన్ని ప్రారంభించారు.


శాతవాహన రాజు (గౌతమీపుత్ర శాతకర్ణి "శాలివాహన"గా పిలువబడేవాడు) శాలివాహన శకాన్ని ప్రారంభించినట్లు తెలుస్తుంది. క్రీ.శ 78లో ఆయన విజయానికి గుర్తిగా ఈ యుగాన్ని ప్రారంభించాడు. "శాలివాహన చక్రవర్తి" తెలుగు వారి తొలి చక్రవర్తి,’శక పురుషుడు" కూడా. తెలుగు పంచాంగ కాలెండర్ ఈయన జన్మ తేది ననుసరించే గుణించబడుతుంది. దీనినే భారత ప్రభుత్వం అధికారిక కాలెండర్ గా ప్రకటించింది.



ఒడయార్



ఒడయార్ కులం మైసూర్ రాష్ట్రంలో ప్రధానమైన కులం. మైసూర్ లో ఒడయారు సంస్థానం ఉండేది. మైసూరు ప్యాలెస్ లో యిప్పటికి కూడా బంగారు కుండను ఆనాటి పాలకుల నైపుణ్యానికి గుర్తుగా ఉంచబడింది. ఈ కులం యొక్క వివిధ శాఖలు ఆంధ్రప్రదేశ్, దక్షిణ భారతదేశంలో విస్తరించినవి



ప్రముఖులు





కుటీర పరిశ్రమగా కుమ్మరం



కొందరు కుమ్మరులు దీనిని ఒక పరిశ్రమగా కూడా విస్తరించి, కేవలం కుండల వరకే కాక మట్టితో వివిధ రకాలైన అలంకరణ సామగ్రి సైతం తయారు చేసి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఈ వృత్తి వారు గతంలో వున్నంత లేకున్నా వున్నవారు కొన్ని కుండలు, ఎక్కువగా పట్టణాలలో కూజాలు, ఎక్కువగా పెద్ద భవంతులలో అలంకరణ సామాగ్రి చేసి అమ్ముతున్నారు. అవి ఎంతో ఆకర్షణీయంగా కూడా వుంటున్నవి. ఇవిగాక పూల కుండీలు కూడా ఎక్కువగా అమ్ముడవుతున్నవి. ఈ వృత్తి పూర్తిగా కనుమరుగయే అవకాశం లేదు.


 కుమ్మరి మట్టితో కుండలు చేసి కాల్చి రైతులకు ఇచ్చేవారు. వీరికి కూడా ప్రతి ఫలితానికి 'మేర' వరి మోపు ఇచ్చేవారు. పెద్ద వస్తువులైన, కాగు, తొట్టి, ఓడ మొదలగు వాటికి కొంత ధాన్యం తీసుకొని ఇచ్చేవారు. పెళ్ళి సందర్భంగా ''అరివేణి'' కుండలని కుమ్మరి వారు ఇవ్వాలి. అనగా కొన్ని కుండలకు రంగులు పూసి కొన్ని బొమ్మలు వేసి ఇచ్చేవారు. ఇవి పెళ్ళిలో అత్యవసరం. అదే విధంగా ఎవరైనా మరణించినా ఆ కార్యక్రమాలకు కొత్త కుండలు అత్యవసరం. వాటిని కుమ్మరి సమకూర్చే వాడు. ఈ కుమ్మరి వ్వవస్త చాల కాలం క్రితమే కనుమరుగైనది. మట్టి కుండల స్థానంలో లోహ పాత్రలు వచ్చినందున వాటి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. పెళ్ళిల్లలో అరివేణి కుండలు ఏనాడో మాయమైనవి. కాని మరణానంతర కార్యాలకు మాత్రం కొత్త కుండల అవసరం ఈ నాటికి తీరలేదు. వాటికొరకు కొన్ని పల్లెల్లో, పట్టణాలలో కొనుక్కోవాలి. ఆవి అరుదుగానైనా దొరుగుతున్నాయి. మట్టి కుండల అవసరము శుభాశుభ కార్యక్రస్మాలకేకాకుండా........ అనేక దేవాలయాలలో కొత్త మట్టి కుండలలోనే మొదటి ప్రసాదము వండుతారు. ఇది ఒక సంప్రదాయము.



కాని ఈ కాలంలో మట్టి తోచేసిన ఇతర అలంకరణ వస్తువులు రంగు రంగులవి, ఎంతో కళాత్మకమైనవి తయారవుతున్నాయి. ఇలాంటివి కేవలం పట్టణ వాసులకే పరిమితం అయ్యాయి. వీటిని పెద్ద పెద్ద ప్రదర్శన శాలలోనె గాక రోడ్డు ప్రక్కన కూడా అమ్ముతున్నారు. కళాత్మకమైన వీటి ధరలు అధికమె.


మట్టి కుండలు గతంలో ప్రతి ఇంట్లోను అత్యవసరం. నీళ్లు తాగె గ్లాసులు తప్ప ఇంకొన్ని చిన్న వస్తువులు తప్ప మిగతావి అన్ని మట్టితో చేసినవే. అదొక సాంప్రదాయం. మట్టి కుండల్లో చేసిన వంటలు రుచిగా వుంటాయని నమ్మే వారు. ఆ తర్వాత కొంత కాలానికి లోహ పాత్రలు వచ్చినా కొన్ని వంటలకు మట్టి పాత్రలనే తప్పని సరిగా వాడె వారు. ఉదాహరణకు పాలు కాగ బెట్టడానికి తప్పనిసరిగా మట్టి పాత్రనె వాడె వారు. దానివలన పాలకు, మజ్జిగకు మంచి రుచి వస్తుంది. అలా పాలను కాచె మట్టి పాత్రను ''పాల సట్టి'' అనె వారు. అలా వంటింటి పాత్రలె గాక ఇళ్లలో ధాన్యం నిలవ చేసుకునే పెద్ద వస్తువులైన, ''ఓడ'',''కాగు'' ''బాన'' ''నీళ్ల తొట్టి'' మొదలగునవి కూడా మట్టితో చేసినవే. ప్రస్తుతం ఇటువంటివి చాల వరకు కనుమరుగైనవి. కొన్ని ఇళ్లల్లో పాతవి కొన్ని ఇప్పటికి కనబడతాయి. లోహ పాత్రలు అందు బాటులోకి వచ్చింతర్వాత కుమ్మరి వృత్తి పూర్తిగా కనుమరుగైనది. వారు తమ బ్రతుకు తెరువుకు ఇతర మార్గాల వైపు మరలి పోయారు. కుమ్మరి మట్టితో కుండలను చేసె విధానము చాల సున్నితమైనై. నేర్పరి తనం కలిగినది, జాగ్రత్తగా చేయ వలసినది."అరివేణి కుండ" (అయిరేని) గతంలో ఈ కుండలు పెళ్ళిల్లో తప్పని సరి. 


కుండలను తయారు చేయు విధానము


కుమ్మరి సమీపంలోని చెరువు నుండి మెత్తటి ఒండ్రు మట్టిని సేఖరించి తీసుక వచ్చి దానిని మరింత మెత్తగా చేసి అందులో వున్న చిన్న చిన్న రాళ్లను వేరు చేసి దానిని నీళ్లతొ తడిపి నాలుగైదు రోజులు ముగ్గ బెడతారు. ఆ తర్వాత దానికి నీళ్లు కలిపి కాళ్లతో బాగా తొక్కు తారు. అలా తయారైన మట్టిని సుమారు ఒక అడుగు కైవారం రెండడుగులు ఎత్తు వున్న స్థూపాకారంగా తయారు చేసి దానిని కుమ్మరి చక్రం మధ్యలో పెడతారు. ఆ కుమ్మరి చక్రం సుమారు రెండడుగుల వ్యాసార్థం కలిగి క్రింద ఒక చిన్న లోహపు బుడిపె వంటిది వుంది అది క్రింద నున్న మరొక లోహపు గిన్నె పై నిలబడి బాలెన్సుడుగా నిలబడి వుంటుంది. ఆ చక్రానికి ఒక చోట సుమారు ఒక అంగుళం లోతున ఒక చిన్న రంధ్రం వుంటుంది. కుమ్మరి ఆ రంధ్రంలో ఒక కర్రను పెట్టి చక్రాన్ని తిప్పు తాడు. అది చాల వేగంగా తిరుగు తుంది. అప్పుడు దానిమీద వున్న మట్టి ముద్ద కూడా తిరుగు తుంది. అప్పుడు కుమ్మరి చక్రానికి అవతల నిలబడి వంగి తన చేతులతో చక్రంపై వున్న మట్టి ముద్ద పైబాగాన కొంత మట్టిని ఒడిసి పట్టి తనకు కావలసిన కుండ మూతి ఆకారానికి మలుస్తాడు. కొత్త ఆకారాల కొరకు అతడు చిన్న చిన్న పుల్లలను వాడు తాడు. చక్రం వేగంగా తిరుగు తున్నందున కుమ్మరి తన చేతులతొ మట్టిపై వత్తిడి కలుగ జేసినందున అది గుండ్రటి ఆకారానికి వస్తుంది. అలా పూర్తిగా కుండ ఆకారానికి రాగానె ఒక సన్నని పుల్ల తీసుకొని కుండ అడుగు బాగాన గుచ్చుతాడు. అప్పుడు చక్రం వేగంగా తిరుగు తున్నందున దానిపై వున్న మట్టి ముద్దకు పైన తయారైన కుండకు బంధం తెగి పోయి కుండ మట్టి ముద్దపై అలానె వుంటుంది. అప్పుడు కుమ్మరి ఒడుపుగా ఆకుండను తీసి క్రింద పెడతాడు. అప్పుడు కుండకు అడుగు భాగం వుండదు. అక్కడ ఖాళీగా పైమూతి లాగానె ఒక పెద్ద రంధ్రం వుంటుంది. చక్రం వేగం తగ్గితె మరలా కర్ర తీసుకొని దాని వేగాన్ని పెంచు తారు. అలా చక్రం పైనున్న మట్టి అంతా అయిపోయి నంతవరు కుండలను, కూజాలను, ఇతర పాత్రలను చేసి వాటిని పక్కన పెడతాడు. అలా తయారయిన ఆ పాత్రలు పచ్చిగా వున్నందున అతి సున్నితంగా వుంటాయి. వాటిని అలా నీడలో ఒక రోజు ఆర బెట్టితె కొంత వరకు గట్టి పడతాయి. అప్పుడు కుమ్మరి ఒక్కొక్క పాత్రను తన ఒడిలోనికి తీసుకొని ఎడం చేతిలోని ఒక అతి నునుపైన రాయిని తీసుకొని, కుండ లోనికి పెట్టి లోపల కుండ అంచులకు తాకించి కుడి చేత్తో కుండ పైన ........ క్రింద రాయి ఆనించిన భాగాన మెత్తగా కొడతాడు. అలా కుండ ఉపరితలమంతా కొట్టగా ఆమెత్తటి కుండ సాగి అడుగున వున్న రంధ్రం మూసుక పోతుంది. అప్పుడు దానిని నీడలో పక్కన పెడతాడు. అదే విదంగా కుండలన్ని పూర్తిగా చేసి రెండు రోజులు నీడలో ఆర బెడతారు.



కుమ్మరి వామి అనగా ఆరిన కుండలను కాల్చడానికు ఉపయోగించె ఒక పొయ్యి లాంటిది. ఇది అర్థ చంద్రాకారంలో వుండి మధ్యలో సుమారు మూడడుగుల ఎత్తు వుండి క్రింద ఒక ఆడుగు కైవారంతొ ఒక రంధ్రం వుండి ఒకడుగు మందంతో గోడ వుండి ఆ గోడ రాను రాను ఎత్తు తగ్గి చివరకు భూమట్టానికి వుంటుంది. దీనినే కుమ్మరి వామి అంటారు. ఆరిన కుండలను ఇందులో నిండుగా వరుసగా పేర్చి తర్వాత అన్నికుండలకు కలిపి పైన చెత్త, ఇతర ఆకులు అలుములతో కప్పులాగ వేసి దానిపై బురద మట్టితో ఒక పొరలాగ అంతటికి ఒక కప్పు వేస్తారు. ఇప్పుడు ముందున్న రంధ్రంలో చెత్త, కంపలు మొదలగునవి వేసి మంట పెడతారు. అలా సుమారు ఒకరోజు కాల్చి ఆ తర్వాత దాన్ని అలాగే వదెలేస్తారు. ఆ వామి చల్లారిన తర్వాత ఒక వైపున మెల్లిగా పైనున్న కప్పును తొలగించి తనకు కావలసిన కుండలను తీసుకొంటారు. ఆ విదంగా కుమ్మరి కుండలను తయారు చేస్తారు.






ప్రస్తుత కాలంలో అలంకార వస్తువులుగా అనేక మట్టి పాత్రలు పట్టణాలలో కనబడు తున్నాయి. పెద్ద పెద్ద కూజాల వంటి పాత్రలు, వాటిపై అనేక అలంకారలతో, లతలు, పువ్వులు మొదలగు అలంకారాలతో ఎంతో అందంగా కనబడు తున్నాయి. అలాగే ఇండ్లలో వేలాడదేసె వస్తువులు మొదలగునవి ఎక్కువగా వస్తున్నాయి. ఇవి అధిక ధరలు కలిగి వుంటాయి. నీళ్లకు కూజాలు, కుండలు, దీపావళికి ప్రమెదెలు మొదలగు మట్టి పాత్రలు పట్టణాలలో ఇప్పటికి కనబడుతూనె ఉన్నాయి. అంతరించి పోతున్న కుమ్మరి వృత్తికి పాత వాసనలు తెలియ జేయడాని ఇవే ఆధారాలు.





మృణ్మయ పాత్రలు







బంకమన్ను తదితర పదార్థాల నుండి తయారుచేసిన వస్తువులను మృణ్మయ పాత్రలు అంటారు. వీటిని చేయడాన్ని కుమ్మరం అంటారు. వీటిని ఆంగ్లంలో సిరామిక్స్ అంటారు. సిరామిక్స్ అనే పదము గ్రీకు ప్రథమైన కేరామోస్ నుండి పుట్టినది. దీని అర్థము కుండలు. మృణ్మయ వస్తువులలో కుండలు, మట్టిసామాగ్రి, పింగాణీ పాత్రలు, గృహాలంకరణ సామాగ్రి, పారిశుధ్య సామాగ్రి మొదలైనవి ఉన్నాయి.



ఉపయోగాలు




  1. భవన నిర్మాణములో ఇటుకలుగా, పెంకులుగా

  2. లోహ పరిశ్రమతో కొలిమి నిర్మాణాలకు

  3. రసాయన పరిశ్రమలో రాతి సామాగ్రి, పింగాణీ సామాగ్రిగా

  4. పారిశుధ్య, మురుగునీటి పారుదల పనులతో రాతి సామాగ్రిగా

  5. చైనా పింగాణీగా శుభ్రత పరిరక్షణలో

  6. విద్యుత్ పరిశ్రమలో విద్యుత్ బంధకాలుగా, పింగాణీ సామాగ్రిగా


ముడి పదార్థాలు సిరామిక్స్ తయారీకి వాడే ముడి పదార్థాలు


 a బంకమన్ను b పెల్‌స్ఫార్ అనే ఖనిజము c ఇసుక.


బంకమన్ను, పెల్‌స్ఫార్ లు ముఖ్యంగా అల్యూమినా (Al2O3) సిలికా (SiO2) లను, కొంత పరిమాణంలో (Na2O, K2O, MgO, CaO) లను కలిగి ఉంటుంది.



విధానము



ముడి పదార్థాల మిశ్రమాన్ని సన్నగా పొడిగా విసురుతారు. ఈ ప్రక్రియను చూర్ణము (పల్వరైజేషన్) అంటారు. చూర్ణము చేయబడిన మిశ్రమానికిఒ అగినంత నీటిని కలిపి ముద్దగా తయారుచేస్తారు. ఈ ముద్దను మూసలో వేసి నిర్ణీత ఆకృతి గల వస్తువుగా రూపొందించి ఎండబెట్టుతారు. ఎండిన వస్తువులను 20000C వరకు క్రమంగా వేడి చేస్తారు. వేడి చేసే ప్రక్రియలో 150 - 650 0C ల మధ్యన నీరు తొలగించబడుతుంది. 600 - 900 0C ల వద్ద భస్మీకరణం జరిగి కార్బన్ డై ఆక్సైడ్ విడుకలవుతుంది. దాదాపు 900 0C వద్ద సిలికేట్లు ఏర్పడటం జరుగుతుంది. ఈ సిలికేట్లు గల పదార్థము గట్టిగా ఉండుట చేత మృణ్మయ వస్తువులు తయారగును. ముడి పదార్థాల మిస్రమ శాతాన్ని మార్చటం వలననూ, వేడి చేసి ఉష్ణోగ్రతలో తేడాల వల్లనూ మనకు వివిధ రకాల మృణ్మయ వస్తువులు లభిస్తాయి.



మృణ్మయ పాత్రల పరిశ్రమ






A potter shapes a piece of pottery on an electric-powered potter's wheel



మృణ్మయ పాత్రల పరిశ్రమలో మట్టి పాత్రలు, గోడ పెంకులు, పింగాణీ విద్యుత్ బంధనాలు, శుభ్రతా పరిరక్షణ పాత్రలు, మెరుపుగల గోడ పెంకులు మున్నగునవి ఉన్నాయి. మృణ్మయ పాత్రలను రెండు రకాలుగా విభజింపవచ్చు.



  1. సాధారణ కుండ పాత్రలు (టెర్రాకోటా లేక పోటరీ)

  2. మృత్తికా పాత్రలు (ఎర్థన్ వేర్)



సాధారణ కుండ పాత్రలు



ఇది సాధారణ బంక మన్ను నుండి తయారుచేసే పాత్రలు. సచ్చిద్ర పాత్రలైన కుండలు, కూజాలు, సాదహరణ ఇటుకలు, పైకప్పు పెంకులు మొదలైనవి. వీటికి మెరుపు ఉండదు.kaani వాటి తయారీలో ఉష్ణోగ్రత 11000C వరకు మాత్రమే పెరుగుతుంది. అందుచేత ఇవి గట్టిగా ఉండవు.



కుండపాత్రలకు ఉపయోగించు మట్టి రకాలు



కింది కుండల ఉపయోగిస్తారు మట్టి వివిధ రకాల జాబితా



  1. కయోలిన్ : దీనిని చైనా మట్టి అనికూడా అంటారు. ఎందుకంటే దీనిని ఎక్కువగా చైనాలో ఉపయోగిస్తారు.

  2. బాల్ మట్టి : యిది పాస్టిక్ వలె ఉంటుంది. యిది చూర్ణం చేయబడిన సెడిమెంటరీ మట్టి. యిది కొన్ని సేంద్రియ పదార్థములు కలిగి ఉంటుంది. దీనిని చాలా కొద్దిమొత్తంలో పోర్సలైన్ కు కలిపి ప్లాస్టిసిటీని పెంచుతారు.

  3. ఫైర్ క్లే

  4. స్టోన్ వేర్ క్లే



గ్రామాలలో ఉపయోగించు వివిధ మట్టి పాత్రలు



కూజ


ఇది చిన్న కుండ ఆకారంలో వుండి సన్నని, పొడవుగా వున్న గొంతు కలిగిన మట్టి పాత్ర. ఎండాకాలంలో చల్లని నీళ్ళకొరకు వీటిని ఉపయోగిస్తారు. ఈ నాటికి వీటి ఉపయోగము చాల ఎక్కువగానే ఉంది. ఇందులోని నీళ్ళు చల్లగాను రుచి కరంగాను వుంటాయి. నీటి కొరకు తప్ప మరెందుకూ దీనిని వాడరు.


నీళ్ల తొట్టి




మట్టితో చేసిన నీళ్లతొట్టి



గతంలో పల్లెల్లో ఇండ్లలో నీళ్ళను నిలువ చేసుకోడానికి మట్టితో చేసిన వాటిని ఉపయోగించే వారు. వాటినే తొట్టి అంటారు. పశువుల కొట్టంలో ఇలాంటి తొట్టి ఒకటి తప్పక వుంటుంది. అందులో బియ్యం కడిగిన నీళ్ళను, గంజి మొదలగు వంటింట్లో నుండి వచ్చే వ్వర్థ పదార్థాలను ఈ తొట్టి లోవేసేవారు. వాటిని పశువులు త్రాగుతాయి. దానినే కుడితి అనేవారు. అలాగే స్నానం చేయడానికి కావలసిన నీళ్ళను నిలువ చేసుకోవడానికి కూడా ఈ తొట్టిని ఉపయోగించేవారు. ప్రస్తుతం వీటి ఉపయోగము పూర్తిగా కనుమరుగైనది. వీటి స్థానంలో ఇటుకలు, సిమెంటుతో కట్టిన తొట్లు వాడకంలోకి వచ్చాయి. ఏక వచనము = తొట్టి, బహువచనము = తొట్లు.



పొంత


పొంత అనగా స్నానానికి నీళ్ళను కాగ బెట్టు కోడానికి వాడే పెద్ద మట్టి పాత్ర. దీనిని పెద్ద పొయ్యి మీద పెట్టి శాశ్వతంగా వుండేటట్టు మట్టితో గొంతు వరకు కప్పేస్తారు. దానిని కదల్చడానికి వీలుండదు.దీనిని బాన లేదా దొంతి అనికూడ అంటారు. కానీ బానను నీళ్ళను కాగబెట్టడానికుప యోగిస్తే దానిని పొంత అని అంటారు. మిగతా వాటి కొరకు ఉపయోగిస్తే వాటిని బాన లేదా దొంతి అని అంటారు.


బుడిగి


బుడిగి అనగా ఆత్యంత చిన్న మట్టి పాత్ర. దీనిలో డబ్బులు దాచు కుంటారు. అలాగే వీటిని గతంలో నీళ్ళు త్రాగ డానికి కూడా వాడుతారు. ప్రస్తుత కాలంలో వీటిని ఐస్ క్రీములు వుంచ డానికి ఉపయోగిస్తున్నారు.






టెర్రకోట పదం యొక్క అర్థం


టెర్రకోట, టెర్రా కోటా లేదా టెర్రా-కొట్టా ఇటలీభాష

"కాల్చిన భూమి",[2] లాటిను టెర్రా కోక్టా నుండి,[3] ఒక రకమైన మట్టి పాత్రలు, మట్టి ఆధారిత మెరుస్తున్న సిరామికు.[4] ఇక్కడ కాల్చిన పింగాణి. టెర్రకోట అనేది సాధారణంగా మట్టి పాత్రలలో తయారైన శిల్పకళకు, నాళాలు (ముఖ్యంగా పూల కుండలు), నీరు, వ్యర్థ నీటి పైపులు, ఇంటికప్పుకు ఉపయోగించే పెంకులు, ఇటుకలు, భవన నిర్మాణంలో ఉపరితల అలంకారంతో సహా వివిధ ఆచరణాత్మక ఉపకరణాలుగా ఉపయోగిస్తారు.[5] ఈ పదాన్ని టెర్రకోట సహజ గోధుమ నారింజ రంగును సూచించడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ పదప్రయోగంలో గణనీయంగా మార్పులు సంభవించాయి.







టెర్రకోట స్పందనను శిల్పకళలో ఒక మాధ్యమంగా, టెర్రకోట ఆర్మీ, గ్రీకు టెర్రకోట బొమ్మలు, నిర్మాణ అలంకరణలో పొందుపరుస్తుంది. ఆసియా, ఐరోపాలోని పింగాణీ శిల్పం కళ గురించి చెప్పడానికి ఈ పదప్రయోగం ఉపయోగించబడదు. 19 వ శతాబ్దంలో పశ్చిమ దేశాలలో ప్రాచుర్యం పొందటానికి ముందు కొన్ని శతాబ్దాలుగా ఆసియాలో భవనాల బాహ్య ఉపరితలాలుగా మెరుస్తున్న నిర్మాణ టెర్రకోట ఉపకరణాలు దాని మెరుస్తున్న రూపాన్ని తీసుకువచ్చేలా సంస్కరించబడి ఉపయోగించబడ్డాయి. ఆర్కిటెక్చరలు టెర్రకోటా యాంటిఫిక్సు, రివిట్మెంట్సు వంటి అలంకరించబడిన సిరామికు ఎలిమెంట్లను కూడా సూచిస్తుంది. ఇది ఐరోపా సంప్రదాయ నిర్మాణకళలో, అలాగే పురాతన నియరు ఈస్టులో దేవాలయాలు, ఇతర భవనాల రూపానికి పెద్ద సహకారం అందించింది.


పురావస్తు శాస్త్రం, కళా చరిత్రలో, కుమ్మరి చక్రంలో తయారు చేయని బొమ్మలు వంటి వస్తువులను వివరించడానికి "టెర్రకోట" తరచుగా ఉపయోగించబడుతుంది. అదే పదార్థం నుండి చక్రం మీద లేదా తయారు చేయబడిన నాళాలు, ఇతర వస్తువులను మట్టి పాత్రల కుండలు అంటారు; పదం ఎంపిక పదార్థం లేదా కాల్పుల సాంకేతికత కంటే వస్తువు రకం, తయారీ విధానం మీద ఆధారపడి ఉంటుంది.[6] మెరుస్తున్న ముక్కలు, భవన నిర్మాణం, పరిశ్రమల కోసం తయారు చేయబడిన వాటిని కూడా టెర్రకోట అని పిలుస్తారు, అయితే టేబుల్వేరు ఇతర నాళాలను మట్టి పాత్ర అని పిలుస్తారు (కొన్నిసార్లు టెర్రకోట మెరుస్తున్నట్లయితే), లేదా ఫైయెన్సు వంటి మరింత ఖచ్చితమైన పదప్రయోగం ఉపయోగించబడింది.



ఉత్పత్తి



శుద్ధి చేసిన బంకమట్టితో అవసరమైన ఆకారం రూపొందించబడుతుంది. తరువాత దానిని ఎండబెట్టి ఆ తరువాత దానిని ఒక బట్టీలో లేదా దహన పదార్థం పైన ఒక గొయ్యిలో ఉంచి, ఆపై కాల్చాలి. చారిత్రాత్మక, పురావస్తు పరిశోధనల ఆధారంగా సాధారణంగా దీని కాల్పుల ఉష్ణోగ్రత 1,000 ° సెం(1,830 ° ఫా) గా ఉంటుంది. అయినప్పటికీ ఇది 600 ° సెం (1,112 ° ఫా) కంటే తక్కువలో కూడా తయారు చేయవచ్చు.[7] ఇనుము పదార్ధం, కాల్పుల సమయంలో ఆక్సిజనుతో ప్రతిస్పందిస్తుంది, ఇది కాల్చిన పదార్ధానికి ఎర్రటి రంగును ఇస్తుంది. అయితే మొత్తం రంగు పసుపు, నారింజ, బఫు, ఎరుపు, "టెర్రకోట", గులాబీ, బూడిద లేదా గోధుమ రంగులలో విస్తృతంగా మారుతుంది.[8] రోమను బొమ్మలు వంటి కొన్ని సందర్భాలలో, తెలుపు-రంగు టెర్రకోటను పైపుక్లే అని పిలుస్తారు. ఎందుకంటే అటువంటి మట్టిని తరువాత పొగాకు పైపుల తయారీకి ప్రాధాన్యత ఇచ్చారు. సాధారణంగా 19 వ శతాబ్దం వరకు వీటిని మట్టితో తయారు చేస్తారు.[ఉల్లేఖన అవసరం]


కాల్చిన టెర్రకోట నీటితో నిండినది కాదు. కానీ కాల్పులకు ముందు శరీరాన్ని ఉపరితలం కాల్చడం వల్ల దాని పోరసు తగ్గి, అది నీటిలోపల గ్లేజు పొర ఉంటుంది. అనేక వాతావరణాలలో తోటలో మొక్కలు పెంచడానికి ఉపయోగించే కుండలు(తొట్లు), లేదా భవన అలంకరణ కోసం ఉపయోగించే పూలకుండీలు, చమురు భద్రపరిచే కంటైనర్లు, చమురు దీపాలు లేదా ఓవెన్ల తయారీ కోసం, ఒత్తిడితో కూడిన నీటిని (పురాతన ఉపయోగం) తీసుకెళ్లడానికి భూమి క్రింద పైపులుగా వాడటానికి ఇది అనుకూలంగా ఉంటుంది. టేబుల్వేరు, శానిటరీ పైపింగు లేదా గడ్డకట్టే వాతావరణంలో భవనం అలంకరణ వంటి చాలా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించబడుతుంది. పదార్థాన్ని వెలుపలి రూపం మెరుస్తూ ఉండాలి. టెర్రకోట, అన్రాకు చేయబడితే, తేలికగా కొడితే రింగు ఔతుంది.


పెయింటెడు ("పాలిక్రోమ్") టెర్రకోట సాధారణంగా మొదట సన్నని కోటు గెస్సోతో కప్పబడి, తరువాత పెయింటు చేయబడుతుంది. ఇది చాలా విస్తృతంగా ఉపయోగించబడింది. కానీ పెయింటు ఇండోరు స్థానాలకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. సిరామికు గ్లేజులో లేదా కింద కాల్చిన రంగుల కంటే చాలా తక్కువ మన్నికైనది. టెర్రకోట శిల్పం 18 వ శతాబ్దం వరకు పశ్చిమంలో దాని "ముడి" కాల్చిన స్థితిలో చాలా అరుదుగా ఉపయోగించబడింది.[9]



కళాచరిత్రలో



పాకిస్తాన్ (క్రీ.పూ. 3000–1500) లోని మొహెంజో-దారో త్రవ్వకాలలో పురావస్తు శాస్త్రవేత్తలు టెర్రకోట ఆడ బొమ్మలను కనుగొన్నారు. ఫాలసు ఆకారపు రాళ్లతో పాటు, ఇవి ఒక విధమైన పునరుత్పత్తి కల్ట్‌ను సూచిస్తాయి.[10] బర్నీ రిలీఫు క్రీ.పూ 1950 లో ప్రాచీన మెసొపొటేమియాకు చెందిన అద్భుతమైన టెర్రకోట ఫలకం. మెసోఅమెరికాలో ఓల్మెకు బొమ్మలలో ఎక్కువ భాగం టెర్రకోటలో ఉన్నాయి. పురాతన ఈజిప్టులో టెర్రకోటతో అనేక ఉషబ్టి మార్చురీ విగ్రహాలు కూడా తయారు చేయబడ్డాయి.


ప్రాచీన గ్రీకుల తనాగ్రా బొమ్మలు భారీగా ఉత్పత్తి చేయబడిన అచ్చువేయడం ద్వారా తయారు చేయబడ్డాయి. కాల్చిన టెర్రకోట బొమ్మలు ఇవి హెలెనిస్టికు కాలంలో విస్తృతంగా సరసమైనధరలో అందుబాటులో లభించినట్లు కనిపిస్తాయి. అవి పూర్తిగా అలంకారవస్తువులుగా ఉపయోగించబడి ఉంటాయి. అవి విస్తృతమైన గ్రీకు టెర్రకోట బొమ్మలలో భాగంగా ఉన్నాయి. వీటిలో ఆఫ్రొడైటు హీలు వంటి పెద్ద, అధిక-నాణ్యతకలిగిన రూపకల్పనలు ఉన్నాయి; రోమన్లు ​​కూడా చాలా చిన్న చిన్న బొమ్మలను తయారు చేశారు. ఇవి తరచుగా మతపరమైనవి. ఎట్రుస్కాను కళ తరచుగా పెద్ద విగ్రహాలకు కూడా రాతికి బదులుగా టెర్రకోటకు ప్రాధాన్యతనిస్తూ బొమ్మలను తయారుచేసి ఉపయోగించింది. ఉదాహరణకు వెయి నిలువెత్తు అపోలో, జీవిత భాగస్వాములతో సర్కోఫాగసు. కాంపనా రిలీఫులు పురాతన రోమను టెర్రకోట రిలీఫులుగా ఇవి మొదట ఎక్కువగా భవనాల వెలుపల రాతికి చౌకైన ప్రత్యామ్నాయంగా ఫ్రీజెలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.


భారతీయ శిల్పకళలో సింధు లోయ నాగరికత (రాతి, లోహ శిల్పం చాలా అరుదుగా ఉండటంతో) నుండే టెర్రకోటను ఎక్కువగా ఉపయోగించుకుంది. మరింత అధునాతన ప్రాంతాలలో క్రీస్తుపూర్వం 1 వ శతాబ్దం నాటికి అచ్చులను ఉపయోగించడం కొరకు మోడెలింగును ఎక్కువగా వదిలివేసింది. ఇది పెద్ద బొమ్మలను, దాదాపు నిలువెత్తు ప్రమాణంలో (ముఖ్యంగా గుప్తుల కాలంలో) శతాబ్దాల కాలం కొనసాగింది. టెర్రకోట జానపద శిల్పం స్థానిక ప్రసిద్ధ సంప్రదాయాలు బంకురా గుర్రాలు వంటివి నేటికీ ఉనికిలో ఉన్నాయి.[11]


" ప్రీకోలోనియలు వెస్టు ఆఫ్రికన్ శిల్పం" (వలసపాలనకు ముందు పశ్చిమాఫ్రికా శిల్పం) కొరకు టెర్రకోటను విస్తృతంగా ఉపయోగించుకుంది. [12]  ప్రపంచంలో టెర్రకోట కళను ఉత్పత్తి చేయడానికి ఎక్కువగా గుర్తించబడిన ప్రాంతాలలో మధ్య, ఉత్తర-మధ్య నైజీరియా నోకు సంస్కృతి, పశ్చిమ, దక్షిణ నైజీరియాలోని ఇఫు (బెనిను) సాంస్కృతిక అక్షం (అనూహ్యంగా సహజ శిల్పానికి కూడా ప్రసిద్ది చెందింది), ఇగ్బో తూర్పు నైజీరియా, సంస్కృతి ప్రాంతాలలో టెర్రకోట కుండలు ప్రాధాన్యత వహించాయి. సంబంధిత కానీ ప్రత్యేకమైన, సంప్రదాయాలు ఈ ప్రాంతంలోని విస్తృతమైన కాంస్య, ఇత్తడి శిల్పాలకు జన్మనిచ్చాయి.[13]


చైనా శిల్పం చాలా ప్రారంభ తేదీ నుండి గ్లేజింగు, రంగు, లేకుండా టెర్రకోటను బాగా ఉపయోగించుకుంది. క్రీస్తుపూర్వం 209–210 నాటి చక్రవర్తి క్విను షి హువాంగు కాలంలో రూపొందించబడిన ప్రసిద్ధ " టెర్రకోట ఆర్మీ " కొంతవరకు విలక్షణమైనది. రెండు వేల సంవత్సరాల క్రితం సమాధులలో, ఇతర ప్రదేశాలో ఉపయోగించిన కుడ్యశిల్పదృశ్యాలు ఇండేవి. తరువాత బౌద్ధులు తయారు చేయబడిన బొమ్మలు తరచూ పెయింటు చేయబడి, మెరుగులు దిద్దబడిన టెర్రకోట శైలిలో తయారు చేయబడ్డాయి. యిక్సియను మెరుస్తున్న మృణ్మయ లుహాన్లు (బహుశా క్రీ.శ. 1150–1250) ఇప్పుడు వివిధ పాశ్చాత్య పురాతన వస్తు సంగ్రహాలయాలలో ఉత్తమ ఉదాహరణలుగా భద్రపరచబడి ఉన్నాయి. [14] హాను రాజవంశానికి చెందిన ఇటుకతో నిర్మించిన సమాధులు లోపలి గోడ మీద తరచుగా ఇటుకలతో ఒక వైపు మాత్రమే అలంకరించబడ్డాయి; ఈ పద్ధతుల్లో అచ్చుపోసిన ఆకారాలు ఉన్నాయి. తరువాతి సమాధులలో టాంగు రాజవంశానికి చెందిన ప్రసిద్ధ గుర్రాలతో సహా, రక్షణాత్మక స్వభావం కలిగిన ఆత్మలు, మరణానంతర జీవితం కోసం జంతువులు, సేవకులు ఉన్నారు; పరిభాషలో ఏకపక్షంగా వీటిని టెర్రకోటలుగా సూచించరు.[15]


మద్యయుగ ఐరోపా కళగా టెర్రకోట శిల్పకళను 14 వ శతాబ్దం చివరి వరకు జర్మనీలోని కొన్ని ప్రాంతాలలో అధునాతన అంతర్జాతీయ గోతికు శిక్షణాలయాలలో ఉపయోగించారు.[16] వ్యాసం ప్రారంభంలో వివరించబడిన బోహేమియా కన్య అక్కడ లభించిన ప్రత్యేక ఉదాహరణ.[17] కొన్ని దశాబ్దాల తరువాత ఇటాలీలో ఇది పునరుద్ధరించబడింది. త్రవ్వకాలలో లభించిన సంప్రదాయ టెర్రకోటాలతో జర్మనీ టెర్రకోటా కళాఖండాల ఉదాహరణల నుండి ప్రేరణ పొందింది. ఇది క్రమంగా మిగిలిన ఐరోపాకు వ్యాపించింది. ఫ్లోరెన్సు లూకా డెల్లా రాబియా (1399 / 1400-1482 మధ్యాకాలానికి చెందిన ఒక శిల్పి), ఆయన మెరుస్తున్న, పెయింటు చేసిన టెర్రకోటాలో ప్రత్యేకమైన రాజవంశ కుటుంబాన్ని స్థాపించాడు. ముఖ్యంగా చర్చిలు, ఇతర భవనాల వెలుపలి భాగాలను అలంకరించడానికి ఉపయోగించబడిన పెద్ద రౌండెల్సు. ఇవి సమకాలీన మైయోలికా, ఇతర టిను-గ్లేజ్డు కుండల మాదిరిగానే ఉపయోగించబడ్డాయి. ఇతర శిల్పులలో విగ్రహాలను నిర్మించిన పియట్రో టొరిజియానో ​​(1472–1528), ట్యూడరు రాజకుటుంబానికి చెందిన ఇంగ్లాండు బస్టుసైజు శిల్పాలు ఉన్నాయి. 1521 గియోవన్నీ డా మైయానో రూపకల్పనలో హాంప్టను సభామణ్డపం అలంకరించిన రోమను చక్రవర్తుల మెరుస్తున్న బస్టుసైజు శిల్పాలు ఇంగ్లాండులోని ఇటాలీ నైపుణ్యాలకు మరొక ఉదాహరణ.[18] అవి మొదట పెయింటు చేయబడ్డాయి. కానీ ఇది ఇప్పుడు వాతావరణం ప్రభావంతో ప్రాభవాన్ని కోల్పోయాయి.


18 వ శతాబ్దంలో మెరుస్తున్న టెర్రకోట, ప్రాధమిక మట్టి నమూనాలు లేదా మాక్వేట్ల కొరకు చాలాకాలంగా ఉపయోగించబడింది. అప్పుడు పోర్ట్రెయిటు బస్టుసైజు శిల్పాలతో చిన్న శిల్పాలకు ఒక పదార్థంగా ఇది ఫ్యాషనుగా మారింది. చెక్కిన పదార్థాల కంటే పని చేయడం చాలా సులభం, కళాకారుడి ప్రతిభ ప్రదర్శించడానికి మరింత అనుకూల విధానాన్ని అనుమతించింది.[19] క్లాడియను అని పిలువబడే క్లాడు మిచెలు (1738-1814), ఫ్రాంసులో ప్రభావవంతమైన మార్గదర్శకుడు.[20] ఇంగ్లాండులో పనిచేస్తున్న ఫ్లెమిషు పోర్ట్రెయిటు శిల్పి జాను మైఖేలు రిసుబ్రాకు (1694–1770), రాతితో పెద్ద రూపకల్పనకు సమానంగా తన టెర్రకోట మోడెల్లిని విక్రయించాడు. టెర్రకోటలో మాత్రమే బస్టుసైజు చిత్రాలను ఉత్పత్తి చేశాడు.[21] తరువాతి శతాబ్దంలో ఫ్రెంచి శిల్పి ఆల్బర్టు-ఎర్నెస్టు క్యారియరు-బెల్లూసు అనేక టెర్రకోట శిల్పాలను తయారుచేశాడు.[22] కానీ హిప్పోడమీయా అపహరణ తన పెళ్లి రోజున హిప్పోడమేయాను అపహరించిన ఒక సెంటారు గ్రీకు పౌరాణిక దృశ్యాన్ని వర్ణిస్తుంది.


నిర్మాణకళ


టెర్రకోట పలకలకు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో సుదీర్ఘ చరిత్ర ఉంది. అనేక పురాతన, సాంప్రదాయ రూఫింగు శైలులు సాదా పైకప్పు పలకల కంటే విస్తృతమైన శిల్పకళా అంశాలను కలిగి ఉన్నాయి. ఉదాహరణకు చైనా ఇంపీరియలు పైకప్పు అలంకరణ, పాశ్చాత్య సంప్రదాయ వాస్తుకళ యాంటిఫిక్సు. భారతదేశంలో పశ్చిమ బెంగాలులో టెర్రకోట దేవాలయాలు ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ఇవి ప్రధాన ఇటుక నిర్మాణానికి సమానమైన పదార్థం నుండి చెక్కబడిన అలంకరణతో ఉన్నాయి.


19 వ శతాబ్దంలో భవనాల టెర్రకోట అలంకరణను వాస్తుశిల్పులు మళ్ళీ ప్రశంసించారు. తరచూ మందపాటి టెర్రకోట పెంకులను చదునైన ఉపరితలాలు నిర్మించడానికి ఉపయోగించారు.[23] అమెరికా వాస్తుశిల్పి " లూయిసు సుల్లివను " తన విస్తృతమైన మెరుస్తున్న టెర్రకోట అలంకారానికి ప్రసిద్ది చెందాడు. ఇతర మాధ్యమాలలో అమలు చేయడం అసాధ్యం. ఇంగ్లాండులోని విక్టోరియను బర్మింగుహాం పట్టణ భవనాలలో టెర్రకోట పెంకులు విస్తృతంగా ఉపయోగించబడ్డాయి. సుమారు 1930 నాటికి కాంక్రీటు, ఆధునిక వాస్తుశిల్పం, విస్తృతమైన ఉపయోగం ఎక్కువగా వాస్తుశిల్పంలో టెర్రకోట వాడకాన్ని ముగించింది.[24]



శిల్పం రూపొందించడంలో ప్రయోజనాలు



కంచు శిల్పంతో పోలిస్తే టెర్రకోట శిల్పం సృష్టించడానికి చాలా సరళమైన, వేగవంతమైన ప్రక్రియను తక్కువ వ్యయంలో పూర్తిచేయవచ్చు. మోడలింగు చేయడం సులభం. సాధారణంగా పరిమిత శ్రేణి కత్తులు, చెక్క ఆకృతి సాధనాలతో, ప్రధానంగా వేళ్లను ఉపయోగించడం ద్వారా శిల్పం పూర్తిచేయవచ్చు.[25] కళాకారుడు మరింత స్వేచ్ఛాయుతమైన సౌకర్యవంతమైన విధానాన్ని తీసుకోవడానికి అనుమతిస్తుంది. రాతితో చెక్కడానికి అసాధ్యమైన జుట్టు లేదా దుస్తులు మొదలైన సూక్ష్మమైన వివరాలు టెర్రకోటలో సులభంగా సాధించవచ్చు. వాస్తవికతను సాధించడానికి పలుచని మట్టి పలకలతో డ్రేపరీని తయారు చేయడం ద్వారా వాస్తవికతను సాధించవచ్చు.[26]


పునర్వినియోగ అచ్చు తయారీ పద్ధతులు ఒకేలాంటి శిల్పాలు అనేకం ఉత్పత్తి చేయడానికి ఉపయోగించవచ్చు. పాలరాయి శిల్పం, ఇతర రాతిపనితో పోలిస్తే తుది మెరుగులు దిద్దడం చాలా తేలికైనది. రంగు లేదా లోహపు మెరుగులు దీది మన్నికైన అనుకరణలతో వస్తువులను ఉత్పత్తి చేయడానికి మరింత రంగులద్ది మెరిసేలా చేయడానికి టెర్రకోటా శిల్పాలు అనుకూలంగా ఉంటాయి. బహిరంగ ఉపయోగం కోసం బలమైన మన్నికైన పనులకు ఎక్కువ మందం అవసరం కనుక రాతితో, లోహంతో చేసే శిల్పాలు బరువుగా ఉంటాయి. పగుళ్లను నివారించడానికి అసంపూర్తిగా ఉన్న భాగాన్ని ఎండబెట్టడంలో ఎక్కువ జాగ్రత్త అవసరం. నిర్మాణాత్మక పరిశీలనలు రాతి శిల్పకళకు అవసరమైన వాటికి సమానంగా ఉంటాయి; టెర్రకోట మీద విధించే ఒత్తిడికి ఒక పరిమితి ఉంది. అదనపు నిర్మాణాత్మక మద్దతు జోడించకపోతే నిలబెట్టిన టెర్రకోట విగ్రహాలు జీవిత పరిమాణం బాగా పరిమితం చేయబడతాయి. పెద్ద బొమ్మలు కాల్చడం చాలా కష్టం, మనుగడలో ఉన్న బొమ్మలు తరచుగా కుంగిపోవడం లేదా పగుళ్లను చూపడం ఒక ఉదాహరణ.[27] యిక్సియను బొమ్మలు అనేక ముక్కలుగా కాల్చబడి, వీటిని ఒకటిగా కలిసి నిర్మించడానికి ఇనుప రాడ్లు ఉపయోగించబడతాయి.[28]



మృత్తికా పాత్రలు








ఇవి ఎర్ర బంకమన్ను, బూడిద రంగు గల బంకమన్ను నుండి తయారుచేయబడతాయి. వీటి తయారీలో ఉష్ణోగ్రత 1450 - 1800 0C వరకు పెరుగుతుంది. అందుచేత ఇవి చాల గట్టిగా ఉంటాయి. మెరుపు కొరకు, క్వార్ట్జ్, ఫెల్‌స్ఫార్, కొంచెం బోరాక్స్, కొద్ది పరిమాణంలో లెడ్ ఆక్సైడ్ మిశ్రమాన్ని విసిరి జల్లించి సన్నని పొడిగా మారుస్తారు. ఈ పొడికి తగినంత నీరు కలిపి పలచని లేపనము తయారు చేస్తారు. ఎండిన మట్టి పాత్రలను ఈ పల్చని లేపనములో ముంచి బయటకు తీసి అధిక ఉష్ణోగ్రతకు వేడి చేస్తారు. ఇలా తయారైన పాత్రలు మెరుపును కలిగి ఉంటాయి. స్పార్క్ ప్లగ్ లు, విద్యుత్ బంధకపు పింగాణీ వస్తువులు, కుప్పెలు, వంటింటి సామాగ్రి, పింగాణీ కుండలు, మెరుపుగల గోడ పెంకులు మొదలైనవి మృత్తికా పాత్రలకు ఉదాహరణములు