దానిమ్మ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మహిళల్లో కనిపించే రక్తహీనత సమస్య నివారణకు దానిమ్మ రసం వినియోగం బాగా అక్కరకొస్తుంది. ఇక దానిమ్మకు తోడు 4 పుదీనా ఆకులు చేర్చితే ఇతర పోషకాలతో పాటు రుచి, సువాసన చేకూరతాయి. ఇందులో కలిపే బెల్లం వల్ల కాల్షియం, ఐరన్ లభిస్తాయి. విష జ్వరాలు., ఇతర అనారోగ్యాలతో చికిత్స తీసుకొన్న రోగులు రోజూ గ్లాసు చొప్పున ఈ దానిమ్మ రసం తాగితే వారంలో ఫలితం కనిపిస్తుంది.
కావలసినవి: దానిమ్మ గింజలు - 1 కప్పు, బెల్లం పొడి - 2 చెంచాలు, తాజా పుదీనా ఆకులు - 10.
తయారీ విధానం: దానిమ్మ గింజలు, బెల్లం పొడి, పుదీనాలను మిక్సీ జార్ లో వేసి కొద్దిగా నీళ్లు పోసి తిప్పుకోవాలి.
ఆ తర్వాత దానికి మరికొన్ని నీళ్లు కలిపి తిప్పి దించి వడకట్టుకొంటే దానిమ్మ, పుదీనా జ్యూస్ సిద్దమైనట్లే. కావాలనుకొంటే ఇందులో 2 ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు.