రోగ నిరోధక శక్తి పెరగాలంటే ప్రస్తుతం చాలామంది నిమ్మరసం తాగుతున్నారు. నిమ్మరసంలో ఉండే C విటమిన్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా కాపాడుతుంది. కానీ రోజులో ఎక్కువ సార్లు నిమ్మరసం తాగితే అనారోగ్యమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
రోజుకు ఒక నిమ్మకాయ కంటే ఎక్కువ రసం తాగితే ప్రమాదమే. ప్రధానంగా నిమ్మరసం మోతాదుకి మించి తీసుకుంటే...అనేక రకాల సమస్యలు వస్తాయి. నిమ్మ రసాన్ని ఎక్కువగా తాగితే. దంతాలు దెబ్బతింటాయి. లెమన్ వాటర్‌లో ఎసిడిక్ యాసిడ్ ఉంటుంది. అది దంతాలపై ఎనామెల్‌ను దెబ్బతీస్తుంది. దంతాలు క్రమంగా పసుపు రంగులోకి మారుతున్నాయంటే మీరు మోతాదుకు మించి నిమ్మరసం తాగుతున్నారని అర్థం చేసుకోవాలి.