హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. అనంతరం 341 రన్స్ విజయలక్ష్యంతో బ్యాటింగ్ బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 49.1 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. 36 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై భారత్ గెలుపొందింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో స్మిత్ అత్యధికంగా 98 పరుగులు చేయగా వార్నర్-15, ఏజే ఫించ్-33, లబుషేన్-46, కారీ-18, టర్నర్-13, అగర్-25, కమిన్స్-0, ఎంఏ స్టార్క్-6, జంపా-6, రిచర్డ్‌సన్--24 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టగా జేజే బుమ్రా-1, జడేజా-2, శైనీ-2, కుల్దీప్ యాదవ్-2 వికెట్లు తీశారు.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 340 రన్స్ చేసింది. భారత జట్టులో రోహిత్, ధావన్, కోహ్లీ, రాహుల్‌లు రాణించారు.
రోహిత్ శర్మ 42 రన్స్, శిఖర్ ధావన్ 96, కోహ్లీ 78 రన్స్ చేశారు. ధావన్ సెంచరీ మిస్ కాగా, కోహ్లీ వన్డేల్లో 56వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇక కేఎల్ రాహుల్.. ఆసీస్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు.
తన ఖాతాలో మరో హాఫ్ సెంచరీ వేసుకున్న రాహుల్.. వన్డేల్లో వెయ్యి పరుగుల మైలురాయిని దాటేశాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ శరవేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రాహుల్ వ్యక్తిగతంగా 80 రన్స్ చేసి రనౌట్ అయ్యాడు. ఆసీస్ బౌలర్లలో జంపా మూడు, రిచర్డ్‌సన్ రెండు వికెట్లు తీసుకున్నారు