విండీస్‌పై వరుసగా పదో సిరీస్ గెలుపు
కటక్: వెస్టిండీస్‌తో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించింది. దీంతో ఆ జట్టుపై వరుసగా పది సిరీస్‌లు గెలిచి చరిత్ర సృష్టించింది. 316 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయి 48.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ(85; 81 బంతుల్లో 9x4) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా కేఎల్ రాహుల్(77; 89 బంతుల్లో 8x4, 1x6), రోహిత్‌శర్మ(63; 63 బంతుల్లో 8x4, 1x6) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో జడేజా (39; 31 బంతుల్లో 4x4), శార్ధుల్ ఠాకుర్ (17; 6 బంతుల్లో 2x4, 1x6) ధాటిగా ఆడడంతో భారత్ అద్భుత విజయం సాధించింది. దీంతో 2-1తేడాతో విండీస్‌పై సిరీస్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 315 పరుగులు చేసింది. భారత్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడంతో వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ చేపట్టింది. వెస్టిండీస్ బ్యాట్స్ మెన్లు పూరన్ 89, పోలార్డ్ 74, హోప్ 42, ఛేజ్ 38, హెట్మెయిర్ 37, లూయిస్ 21 పరుగులు చేశారు. భారత్ బౌలర్లు నవదీప్ షైనీ రెండు, షమీ, శార్దూల్, రవీంద్ర జడేజాలు ఒక్కొక్కటి చొప్పున వికెట్లు తీశారు. భారత్ జట్టు 48.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టపోయి 316 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్ మెన్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ 85, లొకేష్ రాహుల్ 77, రోహిత్ శర్మ 63, రవీంద్ర జడేజా 39, శార్ధుల్ ఠాకుర్ 17 పరుగులు చేశారు.
ఒక్కసారిగా మారిన సీన్.. 4 వికెట్లు డౌన్
నిర్ణయాత్మక వన్డేలో.. ఒక్కసారిగా సీన్ మారిపోయింది. వెస్టిండీస్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. స్వల్ప పరుగుల తేడాలో 4 వికెట్లు పడ్డాయి. ఒకానొక సమయంలో ఓపెనర్లు ఇద్దరూ(లూయిస్, హోప్) ధాటిగా బ్యాటింగ్ చేయడంతో.. విండీస్ పటిష్ట స్థితిలో కనిపించింది. భారీ స్కోర్ దిశగా సాగిపోతున్నట్టు అనుమానాలు కలిగాయి. ఇంతలోనే సీన్ మారింది. భారత బౌలర్లు సత్తా చూపారు. 57 పరుగుల జట్టు స్కోర్ దగ్గర విండీస్ తొలి వికెట్ పడింది. జడేజా ఫస్ట్ బ్రేక్ ఇచ్చాడు. లూయిస్(21) ను ఔట్ చేశాడు.
ఆ తర్వాత 70 పరుగుల జట్టు స్కోర్ దగ్గర విండీస్ 2వ వికెట్ ను, 132 పరుగుల దగ్గర 3వ వికెట్ ను, 144 పరుగుల దగ్గర 4వ వికెట్ కోల్పోయింది.
హోప్(42), చేస్ (38), హెట్ మెయిర్ (37)ను ఔట్ అయ్యారు. షైనీ రెండు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు.. బౌలింగ్ ఎంచుకుంది.
హోప్ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. షమీ వేసిన 20 ఓవర్ రెండో బంతికి బౌల్డ్ అయ్యాడు. 42 వ్యక్తిగత రన్స్ దగ్గర షమీ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన హోప్ బౌల్డయ్యాడు. అంతకుముందు లూయిస్ (21) ఫస్ట్ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. రవీంద్ర జడేజా వేసిన తన తొలి ఓవర్‌లో లూయిస్ ఔటయ్యాడు. 15 వ ఓవర్ ఆఖరి బంతికి నవదీప్ షైనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
కాగా, ఈ మ్యాచ్ లో విండీస్ ఓపెనర్ షాయ్ హోప్ సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డే ఫార్మాట్‌లో 3వేల పరుగులు సాధించాడు. హోప్ 35 పరుగుల దగ్గర ఈ మార్క్ ను అందుకున్నాడు. వేగవంతంగా ఈ ఫీట్‌ను సాధించిన రెండో ఆటగాడిగా హోప్ రికార్డు నెలకొల్పాడు. హోప్‌కు ఇది 67వ వన్డే ఇన్నింగ్స్.
పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ బాబర్ అజామ్ రికార్డ్ ను హోప్ క్రాస్ చేశాడు. బాబర్ అజామ్ 68 ఇన్నింగ్స్‌లలో 3 వేల పరుగులు సాధిస్తే.. హోప్ ఒక ఇన్నింగ్స్ ముందుగానే ఆ మార్కును చేరాడు. వన్డే ఫార్మాట్‌లో వేగవంతంగా 3 వేల పరుగులు సాధించిన వారిలో దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీమ్ ఆమ్లా(57 ఇన్నింగ్స్‌లు) టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత హోప్, అజామ్ ఉన్నారు. ఇక వెస్టిండీస్ తరఫున వన్డేల్లో 3 వేల పరుగులు సాధించిన 12వ ఆటగాడిగా హోప్ నిలిచాడు.
పొలార్డ్ సిక్సర్ల హోరు
నిర్ణయాత్మక చివరి వన్డేలో వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ విశ్వరూపం ప్రదర్శించాడు. భారత బౌలింగ్ ను ఉతికారేస్తూ 51 బంతుల్లోనే 74 పరుగులు చేయగా, వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. పొలార్డ్ స్కోరులో 3 ఫోర్లు, 7 భారీ సిక్సులున్నాయి. ఆఖరి ఓవర్లో షమీ బౌలింగ్ లో కొట్టిన స్ట్రెయిట్ సిక్సులు ఇన్నింగ్స్ కే హైలైట్ గా నిలిచాయి. కరీబియన్ బ్యాట్స్ మెన్ ధాటికి ఆఖరి 5 ఓవర్లలో భారత బౌలర్లు ఏకంగా 77 పరుగులు సమర్పించుకున్నారు. ఈ పోరులో విండీస్ బ్యాటింగ్ లైనప్ లో ప్రతి ఒక్కరూ రెండంకెల స్కోరు సాధించారు. ముఖ్యంగా నికోలాస్ పూరన్ బ్యాటింగ్ అద్భుతమైన రీతిలో సాగింది. పొలార్డ్ తో కలిసి పూరన్ భారత బౌలర్లను ఎదుర్కొన్న తీరు విండీస్ ను భారీస్కోరు దిశగా నడిపించింది. పూరన్ 64 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులతో 89 పరుగులు చేశాడు.