వచ్చే ఏడాది జనవరిలో స్వదేశంలో శ్రీలంక తో జరుగనున్న టీ 20సిరీస్ కు అలాగే ఆస్ట్రేలియా తో జరుగనున్న వన్డే సిరీస్ కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. గత కొంతకాలంగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కు శ్రీలంక తో టీ 20 సిరీస్ కు విశ్రాంతినివ్వగా షమీకి ఏకంగా రెండు సిరీస్ లకు విశ్రాంతినిచ్చారు సెలక్టర్లు. ఇక గాయాల కారణంగా ఇటీవల పలు సిరీస్ లకు దూరమైన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అలాగే అదే కారణం తో విండీస్ తో సిరీస్ కు దూరంగా వున్న ఓపెనర్ శిఖర్ ధావన్ పూర్తిగా కోలుకోవడంతో ఈ రెండు సిరీస్ ల్లో ఈ ఇద్దరికి చోటు లభించింది.
మూడు మ్యాచ్ ల టీ 20ల సిరీస్ లో భాగంగా జనవరి 5న శ్రీలంక తో భారత్ మొదటి టీ 20లో తలపడనుంది. ఈసిరీస్ ముగిసాక అదే నెల 14నుండి ఆస్ట్రేలియా తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆరంభం కానుంది.
శ్రీలంక తో తలపడనున్న భారత జట్టు :
కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్ , కేఎల్ రాహుల్ , రిషబ్ పంత్ , శ్రేయాస్ అయ్యర్ ,రవీంద్ర జడేజా , శివమ్ దూబే , చాహల్ , కుల్దీప్ యాదవ్ , నవదీప్ సైనీ , శార్దూల్ ఠాకూర్ , బుమ్రా , మనీష్ పాండే , వాషింగ్ టన్ సుందర్ , సంజూ శాంసన్
ఆస్ట్రేలియా తో తలపడనున్న భారత జట్టు :
కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్ , రోహిత్ శర్మ , కేఎల్ రాహుల్ , రిషబ్ పంత్ , శ్రేయాస్ అయ్యర్ , రవీంద్ర జడేజా , శివమ్ దూబే , కుల్దీప్ యాదవ్ , నవదీప్ సైనీ , శార్దూల్ ఠాకూర్ , బుమ్రా , మనీష్ పాండే , చాహల్ , కేదార్ జాదవ్