నటుడు రాజేంద్రప్రసాద్ భార్య గురించి ఎవరికి తెలియని నిజాలు


ప్రతి వ్యక్తి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందని అంటారు. అది భార్య కావచ్చు,తల్లి కావచ్చు మరొకరు కావచ్చు .. అయితే సినీ ఇండస్ట్రీలో కూడా చాలామంది తమ విజయంలో భార్య పాత్ర ఎంతోఉందని చెబుతారు. హీరోగా ,క్యారెక్టర్ ఆర్టిస్టుగా సత్తా చాటిన నటుడు రాజేంద్రప్రసాద్ విజయం వెనుక కూడా ఓ వ్యక్తి వున్నారు. అతడి భార్య విజయ చాముండేశ్వరి పాత్ర అతడి విజయంలో ఉంది. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు సినీ నేపధ్యం అంతగా పట్టలేదు.


సినిమా విషయం ఎప్పుడూ ఇంట్లో ఎత్తకుండా,కేవలం భార్య పిల్లలో ఇంట్లో ఆనందంగా గడపడం రాజేంద్రప్రసాద్ అలవాటుచేసుకున్నాడు. ఆతర్వాత మెల్లిగా అవగాహన పెంచుకోవడం వలన భర్తపై వచ్చే ఆరోపణలను ఏమాత్రం నమ్మలేదు.


1980-90లలో తిరుగులేని హీరోగా చలామణి అవుతున్నప్పుడు కూడా ఆమె మీడియా ముందుకు ఎప్పుడూ రాలేదు. ఇంటి పనులు,పిల్లల బాగోగులు ఆమె చూసుకునేది. తన అద్భుత నటనతో నట కిరీటి అనిపించుకున్న రాజేంద్ర ప్రసాద్ కి ఇంతటి విజయం దక్కిందంటే పేరులోనే విజయాన్ని పెట్టుకున్న భార్య పాత్ర కీలకం అయింది.


ఎందుకంటే ఒకదశలో వరుస అపజయాలతో దెబ్బతినేసి,కుంగిపోతున్న సమయంలో తాను చెప్పాల్సిన దానికంటే ఎక్కువ చెప్పి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. రాజేంద్రప్రసాద్ కి నటనపై ఆసక్తి పెంచి ఒక్కోమెట్టు ఎదిగేలా విజయ చాముండేశ్వరి చేసింది. ఆంధ్ర చార్లీ చాంప్లిన్ గా ఎదిగేలా దోహదపడింది. ఆ నలుగురు మూవీ చూసి ఎక్కడా నువ్వు కనపడలేదురా,నీ పాత్రే కనిపించిందని కళా తపస్వి విశ్వనాధ్ అన్నారంటే రాజేంద్రప్రసాద్ నటనలో ఎంతగా ఎదిగిపోయాడో చెప్పక్కర్లేదు. హాలీవుడ్ లో కూడా ఎంటరయిన రాజేంద్రుడు మా ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికై తన బాధ్యత సక్రమంగా నిర్వర్తించాడు.