వర్క్ ఫ్రం హోం, కాపీ పేస్ట్, రిఫరల్ జాబ్, పీటీసీ... ఇలాంటి పేర్లతో ఇంటర్నెట్‌లో కొన్ని లక్షల వెబ్‌సైట్లు ఉన్నాయి. వాటిలో 98 శాతం జనాన్ని ముంచేసేవే. అందువల్ల ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడం అనేది ఓ కలే తప్ప నిజం కాదనీ, అలాంటి మంచి వెబ్‌సైట్లు లేనే లేవని అనుకుంటారు చాలా మంది. నిజమేంటంటే వంద శాతం నిజంగా పని చేయించుకొని డబ్బు ఇచ్చే వైబ్‌సైట్లు ఉన్నాయి. అవేంటో తెలియకపోవడం, వాటి కంటే ముందు గూగుల్ సెర్చ్‌లో డూప్లికేట్ వెబ్‌సైట్లే కనిపిస్తుండటం వల్ల ప్రజలకు అవి చేరువవ్వట్లేదు. ఆన్‌లైన్‌లో సంపాదించాలనుకునేవారు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ ఫార్ములా... ముందుగా డబ్బు చెల్లించకుండా ఉండటం. ఏ వెబ్‌సైటైనా ముందుగా డబ్బు అడిగినా, రిజిస్ట్రేషన్ ఫీజు అడిగినా... అది పక్కా మోసమేనని గుర్తించాలి. ఈ సమస్యలకు చెక్ పెడుతూ ఇంటర్నెట్ ప్రొఫెషనల్స్ అందిస్తున్న నిజమైన జన్యూన్ వెబ్‌సైట్ల వివరాలు మీకోసం.
ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడానికి ఎక్కువ మంది ఫాలో అవుతున్న బెస్ట్ రూట్ ఇది. మీలో ఇంటర్నెట్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఇతరత్రా టెక్నికల్ సాఫ్ట్‌వేర్లను ఆపరేట్ చెయ్యగలిగే స్కిల్స్ ఉంటే... మీకు బెస్ట్ ఆప్షన్ ఇది. ఆన్‌లైన్‌లో ఫ్రీలాన్స్ రూపంలో పని చేయించుకొని మనీ ఇచ్చే వెబ్‌సైట్లు చాలా ఉన్నాయి. ఈ సైట్లలో ఎవరైనా ఫ్రీగా రిజిస్టర్ అవ్వొచ్చు. ఆ తర్వాత పని లేదా ప్రాజెక్టులు చేయించుకోవాలనుకునే మేనేజర్లు... ఆ డీటెయిల్స్ ఇస్తారు. ఆ పని చెయ్యాలనుకునేవారు ఎంత అమౌంట్‌కి చేసేదీ చెబుతారు. దాన్ని బట్టీ, తమ పని ఎవరికి ఇవ్వాలో మేనేజర్లు నిర్ణయించుకుంటారు. పని పూర్తవగానే డబ్బు ఇస్తారు.
ఈ విధానంలో పోటీ ఎక్కువగానే ఉంటోంది. ఒక్కో పనికీ దాదాపు పది నుంచీ 20 మంది దాకా పోటీ పడుతున్నారు. ఇలా ఫ్రీలాన్స్ వర్క్స్ ఇస్తున్న వెబ్‌సైట్లు ఇవీ. Fiverr.com, upwork.com, freelancer.com, worknhire.com, ZipRecruiter.com
ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడానికి గూగుల్ తెచ్చిన మరో ఆఫర్ ఇది. జీమెయిల్ ద్వారా ఇందులో జాయిన్ అవ్వొచ్చు. అలా చేరిన వారికి గూగుల్ ఓ యాడ్‌సెన్స్ అకౌంట్ ఐడీ ఇస్తుంది. ఆ తర్వాత సొంత బ్లాగ్ లేదా వెబ్‌సైట్ ఉన్నవారు... ఆ వివరాల్ని గూగుల్ యాడ్‌సెన్స్‌లో ఎంటర్ చెయ్యాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత గూగుల్... ఆ వెబ్‌సైట్‌ని పరిశీలిస్తుంది. దానికి ఎలాంటి యాడ్స్ ఇవ్వొచ్చో డిసైడ్ చేసుకుంటుంది. అలా ఆ బ్లాగ్‌లో లేదా వెబ్‌సైట్స్‌లో యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి. వాటిని ఎవరైనా క్లిక్ చేస్తే, క్లిక్కుకి ఇంత అని రేటు కట్టి అమౌంట్ ఇస్తుంది యాడ్‌సెన్స్. ఐతే, ఈ అమౌంట్ మొత్తం $100 (దాదాపు రూ.7000) పూర్తవ్వాల్సి ఉంటుంది. ఆ వివరాల్ని యాడ్‌సెన్స్ అకౌంట్‌లోని Analytics చూసుకోవచ్చు. మనీ పూర్తవగానే, మన అకౌంట్‌లోకే డైరెక్టుగా క్రెడిట్ చేస్తుంది గూగుల్.
ఇంటర్నెట్‌లో Blogger లాంటి ఫ్రీ బ్లాగ్స్ సైట్స్, ఫ్రీ వెబ్‌సైట్లు చాలా ఉన్నాయి. వాటి ద్వారా ఫ్రీగా బ్లాగ్ లేదా వెబ్‌సైట్ ప్రారంభించుకోవచ్చు. యాడ్‌సెన్స్ ద్వారా ఎక్కువ మనీ సంపాదించాలంటే... మీ వెబ్‌సైట్ లేదా బ్లాగ్‌లో మంచి ఆర్టికల్స్ రాయాల్సి ఉంటుంది. వ్యూవర్‌షిప్ పెంచుకోవాల్సి ఉంటుంది. తద్వారా రేటింగ్ పెరిగి... యాడ్ క్లిక్ వాల్యూ పెరుగుతుంది.
మీరు చక్కగా ట్రాన్స్‌లేషన్ చెయ్యగలరా? ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్, అరబిక్, జర్మన్ భాషల్లో ట్రాన్స్‌లేషన్ చెయ్యగలరా? మీరు విపరీతంగా సంపాదించే అవకాశాలున్నాయి. Freelancer.in, Fiverr.com, worknhire.com, Upwork.com వెబ్‌సైట్లు మీ ట్రాన్స్‌లేషన్ స్కిల్‌కి చక్కగా పని ఇవ్వగలుగుతున్నాయి. ఈ స్కిల్ వల్ల ప్రతీ వర్డ్‌కి 1 నుంచీ 5 సెంట్లు (రూపాయి నుంచీ 3 రూపాయలు) సంపాదించుకునే అవకాశం ఉంది. అంటే ఓ పేజీ ట్రాన్స్‌లేషన్ చేస్తే దాదాపు రూ.20 నుంచీ రూ.50 సంపాదించుకునే వీలుంటుంది. కొన్ని వెబ్‌సైట్లు ఆన్‌లైన్‌లో ట్యూషన్లు చెప్పేవారికి మనీ ఇస్తున్నాయి. ఇవి ఎక్కువగా ఇంగ్లీష్ ట్యూషన్లకు ఆఫర్లు ఇస్తున్నాయి. మీరు చెప్పే ట్యూషన్ ఎంత ఎక్కువ మందికి వెళ్తే... అంత ఎక్కువ మనీ సంపాదించే వీలుటుంది. ఇందుకోసం Vedantu.com, MyPrivateTutor.com, BharatTutors.com tutorindia.net వంటి సైట్లను ఎంచుకోవచ్చు. ముందుగా ఓ ఫామ్ ఫిలప్ చేసి... మీకు ఉన్న క్వాలిఫికేషన్ ఏంటో తెలపాలి. మీరు ఏ సబ్జెక్టుపై ట్యూషన్ చెబుతారో ఎంచుకోవచ్చు. దీని ద్వారా మీరు గంటకు రూ.200 నుంచీ రూ.500 పొందవచ్చు.
మీకు వీడియోలు తీసే అలవాటు ఉంటే... మీరు యూట్యూబ్‌లో చేరి మనీ సంపాదించుకోవచ్చు. ఇందుకోసం జీమెయిల్ అకౌంట్‌తో యూట్యూబ్‌లో లాగిన్ అవ్వొచ్చు. ఆ తర్వాత ఓ పది వీడియోలు అప్‌లోడ్ చేసి, యాడ్‌సెన్స్ అకౌంట్‌కి అప్లై చేసుకోవాలి. యూట్యూబ్ కూడా గూగుల్ వాళ్లదే కాబట్టి... యాడ్‌సెన్స్ అకౌంట్ తప్పనిసరి. యాడ్‌సెన్స్ అకౌంట్ వచ్చాక... మీ వీడియోలకు యాడ్స్ ప్లే అవుతాయి. తద్వారా వచ్చే మనీని మీ బ్యాంక్ అకౌంట్‌లో వేస్తారు. ఇందుకు కూడా మినిమం $100 పూర్తవ్వాలి.
పై వెబ్‌సైట్లు ఏవీ కూడా మిమ్మల్ని ముందుగా మనీ అడగవు. అందువల్ల వీటికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.