గూగుల్ లో ఉద్యోగాలు


గూగుల్... ఇందులో జాబ్ చేయాలనేది చాలా మందికి ఒక కల.. ప్రపంచంలో అత్యున్నత ఉద్యోగాల్లో గూగుల్ ఒకటి. కానీ ఇందులో పని చేసే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. ఇప్పుడు అలాంటి అవకాశం సిద్దంగా ఉంది. గూగుల్ కంపెనీలో ఉద్యోగం చేయాలనుకునేవారికి ఇది నిజంగానే శుభవార్త.


ఎందుకంటే.. త్వరలోనే గూగుల్ దేశవ్యాప్తంగా భారీగా ఉద్యోగాల భర్తీని చేపట్టనుంది. ఈ మేరకు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ట్రాయ్ డిక్కర్ సన్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసారు. ఇకనుంచి గూగుల్థ థర్డ్ పార్టీ పై ఆధారపడకుండా గూగుల్క కస్టమర్సపోర్ట్ ఏజెంట్లను నియమించుకో బోతొందట.


ఇలా నియమించుకుని వీరికి గూగుల్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, బెనిఫిట్స్ ఇస్తుందట. వీరికి మూడు వారాల పెయిడ్ వెకేషన్ కూడా ఇస్తారట. అంతేకాదు.. వీరికి 22 వారాల పెయిడ్ పేరెంటల్ లీవ్ కూడా ఉంటుందట. గూగుల్ ఉద్యోగుల తో పాటు సమగ్రమైన హెల్త్ కేర్ లాంటి బెనిఫిట్స్ కూడా లభిస్తాయట.


మొత్తం ఈ జాబ్స్ 3800 వరకూ ఉన్నాయట. జాబ్ రోల్: కస్టమర్ సపోర్ట్ ఏజెంట్. భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని గూగుల్ కార్యాలయాల్లో ఈ పోస్టులు ఉంటాయట.