రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మరో భారీ నోటిఫికేషన్ వెలువడింది. దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచ్‌లలో ఖాళీగా ఉన్న 926 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఆర్‌బీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ కొలువు పొందడానికి ఇదోచక్కని అవకాశం. నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు చూద్దాం.. పోస్టుల వివరాలు.. * అసిస్టెంట్ పోస్టులు: మొత్తం ఖాళీల సంఖ్య: 926 (హైదరాబాద్-25) రీజియన్ల వారీగా కేటాయింపు..: ➥ అహ్మదాబాద్: 19, ➥ భోపాల్: 42, ➥ భువనేశ్వర్: 28, ➥ చండీగఢ్: 35, ➥ చెన్నై: 67, ➥ గువాహటి: 55, ➥ హైదరాబాద్: 25, ➥ జైపూర్: 37, ➥ జమ్మూ: 13, ➥ కాన్పూర్, లక్నో: 63, ➥ కోల్‌కతా: 11, ➥ ముంబయి: 419, ➥ నాగ్‌పూర్: 13, ➥ న్యూఢిల్లీ: 34, ➥ పాట్నా: 24, ➥ తిరువనంతపురం , కొచ్చి: 20. అర్హత..: అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు పాసైతే చాలు. దరఖాస్తు విధానం..: సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు నిర్ణీత మొత్తంలో ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.450 (ఎగ్జామ్ ఫీజు+ఇంటిమేషన్ చార్జీ) చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.50 (ఇంటిమేషన్ చార్జీ) చెల్లిస్తే సరిపోతుంది.
ఇక సంస్థ ఉద్యోగులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. ఎంపిక విధానం..: *ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష, 200 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.
★ ప్రిలిమినరీ పరీక్షలో 100 మార్కులకు గానూ మూడు విభాగాల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు-30 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 60 నిమిషాలు.
ఒక్కో విభాగానికి 20 నిమిషాల సమయం ఉంటుంది. మల్టీపుల్ చాయిస్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి. ★ మెయిన్ పరీక్షలో 200 మార్కులకు గానూ ఐదు విభాగాల నుంచి 200 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగానికి 40 మార్కులు.
ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నలు అగుడుతారు. వీటిలో రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 135 నిమిషాలు.
మల్టీపుల్ చాయిస్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి. ముఖ్యమైన తేదీలు.. ★ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.12.2019 ★ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 16.01.2020 ★ పరీక్ష ఫీజు చెల్లింపు (ఆన్‌లైన్): 23.12.2019 to 16.01.2020 ★ ప్రిలిమినరీ పరీక్ష తేది: 2020 ఫిబ్రవరి 14, 15 తేదీల్లో. ★ మెయిన్ పరీక్ష తేది: 2020 మార్చిలో.
ఈసీఐఎల్‌లో ఉద్యోగావకాశాలు
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 4 జనవరి 2020.
సంస్థ పేరు: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ
పోస్టుల సంఖ్య: 64
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 4 జనవరి 2020
విద్యార్హతలు: ఇంజినీరింగ్‌లో డిగ్రీ
వయస్సు: 25 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: 2018 & 2019 గేట్ స్కోరు ఆధారంగా..
ఆపై ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.500/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 06-12-2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 04-01-2020