భారతీయ రైల్వేకు చెందిన పలు జోన్లు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసాయి. సుమారు 7,000 పైగా ఉద్యోగాలున్నాయి. వేర్వేరు విభాగాల్లో, వేర్వేరు కోటాల్లో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది.
3585 పోస్టుల్ని నియమించేందుకు సదరన్ రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. సదరన్ రైల్వే పరిధిలోకి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక, పుదుచ్చెరి, అండమాన్ & నికోబార్ ఐల్యాండ్స్, లక్షద్వీప్ వస్తాయి.దరఖాస్తుకు 2019 డిసెంబర్ 31 చివరి తేదీ.
ఈస్ట్ కోస్ట్ రైల్వే కూడా అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది.
భారీగా ఖాళీలను భర్తీ చేస్తోంది. ఏకంగా 1216 పోస్టుల్ని ప్రకటించింది ఈస్ట్ కోస్ట్ రైల్వే. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని వాల్తేర్ డివిజన్‌లో 553 పోస్టులున్నాయి.దరఖాస్తుకు 2020 జనవరి 06 చివరి తేదీ.
ఈశాన్య రైల్వే మరో 1104 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 25 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ner.indianrailways.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
స్పోర్ట్స్ కోటాలో పలు పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఆగ్నేయ మధ్య రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుకు 2020 జనవరి 13 చివరి తేదీ. www.secr.indianrailways.gov.in వెబ్‌సైట్‌లో ఆర్ఆర్‌సీ బిలాస్‌పూర్ స్పోర్ట్స్ కోటా లింక్ క్లిక్ చేసి దరఖాస్తు చేయాలి.
ఉత్తర మధ్య రైల్వే ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. 296 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://ncr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
భారతీయ రైల్వేలోనే కాదు... ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్-DMRC కూడా భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం 1493 ఎగ్జిక్యూటీవ్, నాన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్ http://www.delhimetrorail.com/ ఓపెన్ చేసి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు 2020 జనవరి 13 చివరి తేదీ