హైదరాబాద్ : నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు హైదరాబాద్ లో ఈనెల 24న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఈమేళాలో కోటక్ బ్యాంకు, ఒప్పో మొబైల్స్, క్యూస్ క్రాప్, ఎల్‌పిఎఫ్ సిస్టిమ్స్, ఐడిబిఐ, కార్వీ ఫోర్డ్, శుబగ్రుహ ప్రాజెక్టు, పేరం గ్రూపు, కాలిబ్ హెచ్ ఆర్ రబ్బ యుటిలిటి సొల్యూషన్, సిద్స్‌ఫార్మ వంటి 12 కంపెనీలు పాల్గొన్నట్లు చెప్పారు. ఈకంపెనీలో పనిచేయుటకు 800 ఉద్యోగాల ఎంపికకు జాబ్‌మేళా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్ధులు పదవ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, బికాం, ఏదైనా డిగ్రీ చదివి ఉండాలని, వారిని ఫీల్డ్ సేల్స్, బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్, ఫాషన్ కన్సల్టెంట్, పైనాన్సియల్ అడ్వైజర్, కస్టమర్ సపోర్ట్, మార్కెటింగ్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్, టెలికాలర్స్,కస్టమర్ సర్వీసు రిప్రజేంటివ్, సేల్స్ ట్రేనిస్, ప్రమోటర్స్, ఫీల్డ్ నెట్‌వర్క్, ఇంజనీర్స్ ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఎంపికైన వారికి నెలకు రూ. 10వేల నుండి, రూ.20వేలు వరకు ఇవ్వబడుతున్నట్లు, వయస్సు 1935 సంవత్సరాల అర్హులన్నారు. అర్హత ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతీ,యువకులు తమ బయోడేటాతో పాటు విద్యార్హతల పత్రాల జీరాక్స్ కాఫీలతో మంగళవారం మల్లేపల్లి బాలుర ఐటిఐ క్యాంపస్ వద్ద నున్న ఉపాధి కార్యాలయం, మాడల్ కెరియర్ సెంటర్‌లో ఉదయం 10.30గంటలకు జరుగు మేళాకు హాజరు కావల్సిందిగా కోరారు.
రూరల్ కలెక్టరేట్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అర్హత కలిగిన నిరుద్యోగ యువతకు ఈ నెల 23న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. ప్రైవేటు రంగానికి చెందిన హెటిరో ట్యాబ్స్ అనే ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో ఉత్పాదకత, ఇంజినీరింగ్, నాణ్యత, నిపుణత అనే అంశాలలో 175 ఖాళీలను భర్తీకి జిల్లా ఉపాధి కార్యాలయం, ప్రభుత్వ ఐటీఐ కళాశాల నందు ఉదయం 10.30 గంటలకు మేళా నిర్వహించనున్నట్లు ఆమె వివరించారు. ఐటీఐ (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్), ఇంటర్, డిప్లొమా, బీఎస్సీ కెమిస్ట్రీ, బీకాం, బీఏ, ఎమ్మెస్సీ, బీఫార్మసీ చదివిన వారు అర్హులని, 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాల కోసం 95059 65207 లేదా 91770 97456 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.