వొకేషనల్ కోర్సులకు నోటిఫికేషన్ జారీ

 


హైదరాబాద్ : రాష్ట్రంలో 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించిన స్వల్పకాలిక వొకేషనల్ కోర్సులు (ఫటాఫట్ నౌకరీ కోర్సులు) అందించడానికి ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ చర్యలు తీసుకొన్నారు. దరఖాస్తులు కోరుతూ శనివారం స్పెల్-1 కింద ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ నోటిఫికేషన్ జారీచేశారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభం అవుతుందని, జనవరి 17 వరకు దరఖాస్తు చేయవవ్చన్నారు. పూర్తి వివరాల కోసం www.sive.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు. 


మార్చి 27, 28న పరీక్షలు..


 స్వల్పకాలిక వొకేషనల్ కోర్సుల తరగతులు ఈ నెల 23 నుంచి మార్చి 23 వరకు కొనసాగుతాయి. ఈ కోర్సుల పరీక్షలను మార్చి 27, 28 తేదీల్లో నిర్వహిస్తారు.